ఇన్ఫోసిస్‌లో కీల‌క ప‌ద‌వుల‌కు విశాల్ సిక్కా రాజీనామా

త‌న ఎండీ, సీఈవో రెండూ ప‌ద‌వుల‌కు ఆయ‌న రాజీనామా చేశారు. ఇక‌పై సిక్కా కేవ‌లం ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివ‌రాలు...

శుక్ర‌వారం ఇన్ఫోసిస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సంస్థ సీఈవో విశాల్ సిక్కా రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్లు ఆమోదిస్తున్న‌ట్లు తెలిపింది. త‌న ఎండీ, సీఈవో రెండూ ప‌ద‌వుల‌కు ఆయ‌న రాజీనామా చేశారు. ఇక‌పై సిక్కా కేవ‌లం ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివ‌రాలు...

రాజీనామా కార‌ణం

రాజీనామా కార‌ణం

బీఎస్ఈ ఫైలింగ్‌లో కంపెనీ ఈ స‌మాచారాన్ని వెల్ల‌డించింది. ఇటీవ‌ల నెల‌ల్లో జరిగిన ప‌లు అవాంత‌రాలు, అనుకోని ప‌రిణామాలు ఎదుర‌వ్వ‌డం మూలంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి గ‌ల కార‌ణాల్లో సిక్కా లేఖ‌లో రాసుకొచ్చారని తెలుస్తోంది.

కొత్త నాయ‌క‌త్వం కోసం అన్వేష‌ణ‌

కొత్త నాయ‌క‌త్వం కోసం అన్వేష‌ణ‌

కొత్త ఛైర్మ‌న్, ఎండీ ప‌ద‌వుల‌ కోసం అన్వేష‌ణ సాగుతున్న‌ట్లు స్టాక్ ఎక్స్చేంజీల‌కు ఇన్ఫీ తెలిపింది. శుక్ర‌వారం ఉద‌యం ఒక వార్తాప‌త్రిక‌తతో ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్ ఆర్ నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ సిలికాన్ వ్యాలీ నుంచి వ‌చ్చిన వ్య‌క్తులు సీఈవో ప‌దవికి త‌గ‌ర‌ని అన్నారు.

నాయ‌క‌త్వ సంక్షోభం రెండోసారి

నాయ‌క‌త్వ సంక్షోభం రెండోసారి

ఇన్ఫోసిన్‌లో వ్య‌వ‌స్థాప‌కులంద‌రూ త‌ప్పుకున్న‌ప్ప‌టి నుంచి చాలా విబేధాలు కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా నారాయ‌ణ మూర్తి, సిక్కా కంపెనీ విధానాల‌పై అభిప్రాయ బేధాల‌ను బ‌య‌ట పెడుతూనే ఉన్నారు. దీంతో వ్య‌వస్థాప‌కులు నిర్వ‌హ‌ణ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత కంపెనీలో నాయ‌క‌త్వ సంక్షోభం తలెత్త‌డం ఇది రెండోసారి.

తాత్కాలిక సీఈవో నియామ‌కం

తాత్కాలిక సీఈవో నియామ‌కం

యూబీ ప్ర‌వీణ్ రావును తాత్కాలిక సీఈవో, ఎండీగా నియ‌మించారు. ఆయ‌న బోర్డు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని తెలుస్తోంది. ప్ర‌వీణ్ 1986లో ఇన్ఫోసిస్‌లో చేరారు. లాజిస్టిక్స్‌, లైఫ్ సెన్సెస్, క‌న్సూమ‌ర్ ప్యాకేజ్‌డ్ గూడ్స్‌, రిటైల్ అధిప‌తిగాను, యూర‌ప్ ప్రాజెక్టు డెలివ‌రీ అధిప‌తి గానూ, ఇన్‌ఫ్రా మేనేజ్‌మెంట్ విభాగానికి అధ‌ప‌తిగానూ ప‌నిచేసిన ఈయ‌న ప‌లు కీల‌క ప‌దవుల‌ను కంపెనీలో చేప‌ట్టారు. బెంగుళూరు విశ్వ‌విద్యాల‌యం నుంచి ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో ప‌ట్టా పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+