ఇన్పోసిస్ దెబ్బ ఈ రోజు మార్కెట్ మొత్తంపై పడింది. మూడు రోజుల వరుస లాభాల తర్వాత ఈరోజు మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 31,524 వద్ద ముగియగా; మరో సూచీ నిఫ్ట
హఠాత్తుగా ఇన్ఫోసిస్ సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామాతో ఆ సంస్థ షేర్లపై ఒత్తిడి నెలకొంది.శుక్రవారం ఒక్క రోజులోనే సంస్థ షేర్ విలువ 98 రూపాయలు(9.7%) తగ్గి రూ.923రూపాయలకు పడిపోయింది. ఇన్పోసిస్ దెబ్బ ఈ రోజు మార్కెట్ మొత్తంపై పడింది. మూడు రోజుల వరుస లాభాల తర్వాత ఈరోజు మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 31,524 వద్ద ముగియగా; మరో సూచీ నిఫ్టీ 66.75 పాయింట్లు క్షీణించి 9837 వద్ద స్థిరపడింది.
ఇన్ఫోసిస్ షేర్లు ఒక దశలో 13.39 శాతం నష్టంతో 52 వారాల కనిష్ట స్థాయి 884 రూపాయల వరకూ వెళ్లాయి. చివరకు 9.6% నష్టంతో 923 వద్ద బీఎస్ఈలో ఇన్ఫీ షేర్ సెటిల్ అయింది.
రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(3.53%), టెక్నాలజీ(2.67%), హెల్త్‌కేర్(1.6%), స్థిరాస్తి(0.92%) రంగాలు నష్టపోయాయి, మరో వైపు చమురు సహజ వాయు రంగం(0.92%), ఎఫ్ఎమ్‌సీజీ(0.76%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.21%) లాభపడ్డాయి.

సెన్సెక్స్ సూచీలో నష్టపోయిన వాటిలో ఇన్ఫోసిస్(9.6%), సన్ ఫార్మా(3.81%), ఎన్‌టీపీసీ(2.01%), హెచ్‌డీఎఫ్‌సీ(1.6%), కోల్ ఇండియా(1.52%) ఉండగా ; లాభపడిన వాటిలో
హెచ్‌యూఎల్(2.23%), పవర్ గ్రిడ్(1.85%), టీసీఎస్(1.32%), భారతీ ఎయిర్‌టెల్(1.21%), ఐటీసీ(0.84%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications