For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఏడు బ్యాంకులు

కొన్ని కోట్ల ఖాతాదారుల పొదుపు ఖాతా డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను మార్చ‌డం ద్వారా రోజువారీ, నెల‌వారీ నిధుల ల‌భ్య‌త పెరిగే విధంగా చేస్తున్నాయి. దీంతో పొదుపు ఖాతాదారులు స్వ‌ల్పంగా న‌ష్ట‌పోనున్నారు. ఇప్పు

|

బ్యాంకుల లాభ‌దాయ‌క‌త త‌గ్గుతుండ‌టం, నిరర్ద‌క ఆస్తుల‌కు కేటాయింపులు పెంచుతున్న నేప‌థ్యంలో బ్యాంకులు ఏదో విధంగా నిధుల ల‌భ్య‌త‌ను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇదివ‌ర‌కే ఆర్‌బీఐ ఎన్నిసార్లు వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించినా ఎఫ్‌డీల‌కు వ‌డ్డీ రేట్ల‌ను మాత్రం పెంచ‌కుండా మిగులు నిధులు ఎక్కువ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆగ‌స్టు నెల నుంచి దాదాపు ప్ర‌ధాన బ్యాంకుల‌న్నీ పొదుపు ఖాతాల‌పై దృష్టి సారించాయి. కొన్ని కోట్ల ఖాతాదారుల పొదుపు ఖాతా డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను మార్చ‌డం ద్వారా రోజువారీ, నెల‌వారీ నిధుల ల‌భ్య‌త పెరిగే విధంగా చేస్తున్నాయి. దీంతో పొదుపు ఖాతాదారులు స్వ‌ల్పంగా న‌ష్ట‌పోనున్నారు. ఇప్పుడు వ‌డ్డీ రేట్ల‌ను మార్చిన కొన్ని ప్ర‌ధాన బ్యాంకుల వివ‌రాలేవో తెలుసుకుందాం.

1. ఎస్‌బీఐ:-

1. ఎస్‌బీఐ:-

నిర‌ర్ద‌క ఆస్తుల‌కు కేటాయింపులు చేస్తున్న నేప‌థ్యంలో వ‌స్తున్న నిధుల కొర‌త‌ను నిర్వ‌హించేందుకు, త‌గ్గుతున్న లాభాల‌ను పెంచుకునేందుకు ఎస్‌బీఐ ముంద‌డుగు వేసింది. మొండి బ‌కాయిల‌ను రాబ‌ట్టుకునేందుకు బ‌దులు సామాన్య పొదుపు ఖాతాదార్ల‌పై ప‌డింది. దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గిస్తున్న‌ట్లు జులై 31న ప్ర‌క‌టించింది. రూ.1 కోటి లోపు పొదుపు ఖాతా నిల్వ‌ల‌పై ఎస్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను 4% నుంచి 3.5%కి త‌గ్గించింది. రూ.1 కోటి పైన ఉండే ఖాతాల విష‌యంలో వ‌డ్డీ రేట్లు అలానే ఉంటాయి.

2. బ్యాంక్ ఆఫ్ బరోడా:

2. బ్యాంక్ ఆఫ్ బరోడా:

ఎస్‌బీఐ బాట‌లో న‌డిచిన త‌ర్వాతి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా. ఇది ఆగ‌స్టు 5 నుంచి త‌న పొదుపు ఖాతా వ‌డ్డీ రేట్ల‌ను మార్చింది. రూ.50 ల‌క్ష‌ల లోపు పొదుపు ఖాతాలో ఉన్న డ‌బ్బుపై వ‌డ్డీ రేట్ల‌ను 4నుంచి 3.5 శాతానికి, రూ.50 ల‌క్ష‌ల పైన పొదుపు ఖాతా నిల్వ‌ల‌పై 4% వ‌డ్డీ రేట్ల‌ను నిర్ణ‌యించారు

3. యాక్సిస్ బ్యాంక్:

3. యాక్సిస్ బ్యాంక్:

పొదుపు ఖాతాల‌పై యాక్సిస్ బ్యాంకు వ‌డ్డీ రేట్ల‌ను 0.5% మేర త‌గ్గించింది. రూ.50 ల‌క్ష‌ల లోపు ఉన్న డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 3.5 శాతానికి కుదించారు. అయితే రూ.50 ల‌క్ష‌ల పైన నిల్వ క‌లిగిన పొదుపు ఖాతాల విష‌యంలో మాత్రం వ‌డ్డీ రేట్ల‌ను మార్చ‌లేదు.

4. ఇండియ‌న్ బ్యాంక్‌:

4. ఇండియ‌న్ బ్యాంక్‌:

మ‌రో ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియ‌న్ బ్యాంకు సైతం వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించేసింది. పొదుపు ఖాతాల విష‌యంలో నిల్వ రూ.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉంటే అలాంటి వాటి విష‌యంలో వ‌డ్డీ రేట్ల‌ను 3.50%గాను, రూ.50 ల‌క్ష‌ల పైన ఉన్న పొదుపు ఖాతాల‌కు సంబంధించి 4%గాను నిర్ణ‌యించారు.

5. క‌ర్ణాట‌క బ్యాంక్‌:

5. క‌ర్ణాట‌క బ్యాంక్‌:

దాదాపు 2012 నుంచి బ్యాంకుల‌న్నీ పొదుపు ఖాతాల వ‌డ్డీ రేట్ల‌ను 4% నుంచి మార్చ‌లేదు. ఇప్పుడు క‌ర్ణాట‌క బ్యాంకు రూ.1 నుంచి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ పొదుపు ఖాతా నిల్వ క‌లిగిన వాటి విష‌యంల వ‌డ్డీ రేట్ల‌ను 4 శాతం నుంచి 3.5 శాతానికి త‌గ్గించారు. అయితే రోజు వారీ నిల్వ రూ.1 కోటి కంటే ఎక్కువ ఉన్న ఖాతాల విష‌యంలో వ‌డ్డీ రేట్ల‌ను 5 శాతానికి పెంచారు. అదే రూ.50 ల‌క్ష‌ల నుంచి రూ.1 కోటి నిల్వ ఉన్న పొదుపు ఖాతాల విష‌యంలో వార్షిక వ‌డ్డీ రేటు 4% గానే అమ‌ల‌వుతుంది.

6. యెస్ బ్యాంక్‌

6. యెస్ బ్యాంక్‌

యెస్ బ్యాంక్ సైతం పొదుపు ఖాతాల‌కు వ‌డ్డీ రేట్ల‌ను మార్చిన బ్యాంకుల కోవ‌లో చేరింది. రూ. 1 లక్ష లోపు ఉన్న డిపాజిట్ల విష‌యంలో వ‌డ్డీ రేట్ల‌ను 1శాతం త‌గ్గింపుతో 5శాతానికి కుదించింది. అయితే రూ.1 ల‌క్ష నుంచి రూ. 1 కోటి పొదుపు ఖాతా నిల్వ ఉంటే వ‌డ్డీ రేట్ 6 శాతంగానే అమ‌లవుతుంద‌ని యెస్ బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది. అదే రూ.1 కోటి పైన డిపాజిట్ల విషయంలో ఇంత‌కుముందున్న 6.5 నుంచి 0.25% తగ్గింపుతో 6.25% గా వ‌డ్డీ రేటును నిర్ణ‌యించారు. ఎఫ్‌డీల‌కు ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డులు

7. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

7. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ఆస్తుల ప‌రంగా దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం ఈ నెల‌లో పొదుపు ఖాతా వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. రూ. 50 ల‌క్ష‌ల లోపు డిపాజిట్ల‌ను నిర్వ‌హించే ఖాతాల‌కు వ‌డ్డీ రేటును 3.5 శాతంగా మార్చ‌డం జ‌రిగింది. రూ.50 ల‌క్ష‌ల పైబ‌డి పొదుపు డిపాజిట్ల విష‌యంలో వ‌డ్డీ రేటు 4 శాతంగానే కొన‌సాగ‌నుంది. ఈ బ్యాంకు కొత్త వ‌డ్డీ రేట్లు ఆగస్టు 19 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయి.

English summary

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఏడు బ్యాంకులు | The banks that are reduced interest rates for saving accounts

Top public sector and private lenders have been slashing interest rates on savings bank accounts. A fall in the rate of inflation and surplus money with banks on account of demonetisation are the primary reasons for these cuts. "The profitability levels of Indian banks remains weak owing to the continued pressure on asset quality and low credit demand. It would be imperative for banks with adequate capitalisation to start gaining market share over weaker peers which are starved for capital," credit ratings agency India Ratings said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X