For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాగా పుంజుకున్న ఇన్ఫోసిస్ షేర్‌

శ‌నివారం జ‌రిగే బోర్డ్ స‌మావేశంలో కంపెనీ డైరెక్ట‌ర్లంతా షేర్ల బైబ్యాక్‌కు ప్ర‌తిపాదించ‌వచ్చ‌ని వార్త‌లు వెలువ‌డ‌టంతో ఇన్ఫోసిస్ షేర్లకు క‌ళ వ‌చ్చింది. దీంతో ఈ రోజు ఐటీ రంగం మంచి ప‌నితీరును క‌న‌బ‌రిచింద

|

ఈ రోజు ట్రేడింగ్‌లో షేర్ల బైబ్యాక్ వార్త‌ల‌తో ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ షేర్లు 4.5% లాభ‌ప‌డ్డాయి. శ‌నివారం జ‌రిగే బోర్డ్ స‌మావేశంలో కంపెనీ డైరెక్ట‌ర్లంతా షేర్ల బైబ్యాక్‌కు ప్ర‌తిపాదించ‌వచ్చ‌ని వార్త‌లు వెలువ‌డ‌టంతో ఇన్ఫోసిస్ షేర్లకు క‌ళ వ‌చ్చింది. దీంతో ఈ రోజు ఐటీ రంగం మంచి ప‌నితీరును క‌న‌బ‌రిచింది. ఒక ప‌క్క కొన్ని రంగాల్లో లాభాలు వచ్చిన‌ప్ప‌టికీ బ్యాంకింగ్‌, వాహ‌న రంగాల్లో వచ్చిన న‌ష్టాల‌తో మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ప‌రిపెట్టుకున్నాయి.

 స్వ‌ల్ప లాభంతో ముగిసిన మార్కెట్లు

30 షేర్ల సూచీ సెన్సెక్స్ 24.57 పాయింట్లు లాభ‌ప‌డి 31,795.46 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిఫ్టీ 6.85 పాయింట్లు పుంజుకుని 9904.15 వ‌ద్ద స్థిర‌ప‌డింది. దేశీయ రెండో ఐటీ దిగ్గ‌జం అయిన ఇన్ఫోసిస్ షేరు 4.5% పైకి ఎగ‌సింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(1.84%), టెక్నాల‌జీ(1.79%), పీఎస్‌యూ(0.88%), ప‌వ‌ర్‌(0.85%) లాభ‌ప‌డ‌గా; మ‌రో వైపు ఆటో రంగం(0.72%), బ్యాంకింగ్(0.71%), హెల్త్‌కేర్‌(0.51%), ఎఫ్ఎమ్‌సీజీ(0.29%) న‌ష్టపోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో ఇన్ఫోసిస్‌(4.54%), కోల్ ఇండియా(4.22%), ఎన్టీపీసీ(3.97%), భార‌తీ ఎయిర్‌టెల్‌(2.29%), హెచ్‌డీఎఫ్‌సీ(0.95%) ముందుండ‌గా, న‌ష్ట‌పోయిన వాటిలో సిప్లా(2.85%), అదానీ పోర్ట్స్‌(1.81%), మారుతి(1.23%), కొట‌క్ బ్యాంక్‌(1.17%), హెచ్‌యూఎల్(1.04%) ఉన్నాయి.

English summary

బాగా పుంజుకున్న ఇన్ఫోసిస్ షేర్‌ | markets closed with marginal gains infosys is today top gainer

The Sensex and Nifty ended nearly flat on Thursday paring early gains due to a decline in auto, banking, healthcare and FMCG shares, while a surge in market heavyweight Infosys Ltd after the announcement of a probable share buyback propped up the indexes.
Story first published: Thursday, August 17, 2017, 17:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X