For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

22 క్యారెట్ల‌కు పైన స్వ‌చ్చ‌త గ‌ల బంగారం ఎగుమ‌తుల‌పై నిషేధం

ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 2015-20కి సంబంధించి విదేశ

|

కేంద్ర ప్రభుత్వం 22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్‌ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 2015-20కి సంబంధించి విదేశీ వాణిజ్య విధానం ప్ర‌కారం బంగారం ఎగుమ‌తుల విష‌యంలో కొన్ని మార్పుల‌ను చేశారు. త‌క్ష‌ణ‌మే 22 క్యారెట్ల‌కు పైన స్వ‌చ్చ‌త గ‌ల బంగారాన్ని నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌ప‌రిచింది.

 బంగారం ఎగుమ‌తుల‌పై నిషేధం

22 క్యారెట్లలోపు స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని డీజీఎఫ్‌టీ పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగల బంగారం ఉత్పత్తులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) అధికారి ఒకరు తెలిపారు.కేంద్ర ప్రభుత్వపు తాజా నిషేధం బంగారం ఎగమతులపై ప్రభావం చూపబోదని, అంతర్జాతీయ మార్కెట్‌లో 22 క్యారెట్లపైన స్వచ్ఛతగల బంగారం వస్తువులకు డిమాండ్‌ చాలా తక్కువగానే ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌ఐఈవో) వివరించింది.
రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎండీ రాజేష్ మెహ‌తా ఈ మ‌ధ్యే స్వేచ్చా వాణిజ్య ఒప్పంద కార‌ణంగా ఇబ్బ‌డిముబ్బ‌డిగా వ‌స్తున్న ద‌క్షిణ కొరియా బంగారం దిగుమ‌తుల‌పై ఆందోళ‌న వ్యక్తం చేశారు.
దక్షిణ కొరియా నుంచి దేశంలోకి బంగారం దిగుమతులు బాగా పెరిగాయని దేశీయ బంగారు ఆభరణాల వర్తకులు ఆందోళన చెందుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

Read more about: gold
English summary

22 క్యారెట్ల‌కు పైన స్వ‌చ్చ‌త గ‌ల బంగారం ఎగుమ‌తుల‌పై నిషేధం | Export of jewellery with gold content beyond 22 carats banned

Export of jewellery with gold content beyond 22 carats banned
Story first published: Thursday, August 17, 2017, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X