ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 90వేల కోట్ల ఉద్దేశపూర్వక ఎగవేత
. మార్చి 2016లో ఈ ఉద్దేశపూర్వగ బకాయిల సంఖ్య రూ.76,685 కోట్లుండగా ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య రూ.92,376 కోట్లకు పెరిగింది. దాదాపు 20.4% ఉద్దేశపూర్వక అప్పులు ఎక్కువయ్యాయి.
మార్చితో ముగిసిన త్రైమాసికానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బకాయి పడిన సొమ్ములో 20% వృద్ది కనబడింది. దాదాపు 9వేల మంది కలిసి 92,000 కోట్ల మేర బకాయి పడ్డారు. మార్చి 2016లో ఈ ఉద్దేశపూర్వగ బకాయిల సంఖ్య రూ.76,685 కోట్లుండగా ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య రూ.92,376 కోట్లకు పెరిగింది. దాదాపు 20.4% ఉద్దేశపూర్వక అప్పులు ఎక్కువయ్యాయి.

అదే సమయంలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య ఏడాది కాలంలో 10% పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం మార్చి,2016 సమయానికి 8167 మంది ఉండగా ఈ ఏడాది మార్చి నాటికి 8915కి పెరిగింది. ఈ మొత్తంలో 1914 కేసుల విషయంలో రూ.32,484 కోట్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయింది. 2016-17 ఏడాది సమయంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు 81,683 కోట్ల రుణాలను మాఫీ చేశాయి. గత ఐదేళ్ల కాలంలో ఇదే అత్యధికం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 41% అధికం.
కేవలం ఎస్బీఐ, దాని అనుంబంధ బ్యాంకులు ఎన్‌పీఏలకు సంబంధించి రూ.27,574 కోట్లను రద్దు చేశాయని ఆర్‌బీఐ సమాచారం నుంచి తెలుస్తోంది. మొండి బకాయిలు లేదా వసూలు కాని రుణాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది ఈ సంఖ్య రూ.5.02 లక్షల కోట్లుగా ఉండగా ఈ ఏడాది మార్చి నాటికి 6.41 లక్షల కోట్ల స్థాయికి పెరిగింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications