ఐఐఐటీ-హైద‌రాబాద్‌లో రూ.14 ల‌క్ష‌ల ప్యాకేజీ ఉద్యోగాలు

సాధారణంగా అత్య‌ధిక వేత‌నాలు వ‌చ్చే క్యాంప‌స్ నియామ‌కాలంటే అంద‌రికీ గుర్తొచ్చేది ఐఐటీలే. అయితే అదే కోవ‌లో మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ ఉంద‌ని చాలా మందికి తెలియ‌దు. దాని వివ‌రాలేంటో ఇక్క‌డ తెలుసుక

బీ.టెక్ విద్యార్థుల‌కు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ ఒక క‌ల‌. చ‌దువు పూర్త‌య్యేలోపే ఉద్యోగం తెచ్చుకుని, చ‌దువు అవ్వ‌గానే ఉద్యోగంలో చేరాలా, లేక పై చ‌దువుల‌కు వెళ్లాలా అనే రెండు ఆప్ష‌న్లు ఉండ‌టం ఒక గ‌ర్వ‌కార‌ణ‌మైన విష‌యంగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక‌ప్పుడు చాలా కాలేజీల్లో ఈ ట్రెండ్ కొన‌సాగింది. సాధారణంగా అత్య‌ధిక వేత‌నాలు వ‌చ్చే క్యాంప‌స్ నియామ‌కాలంటే అంద‌రికీ గుర్తొచ్చేది ఐఐటీలే. అయితే అదే కోవ‌లో మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ ఉంద‌ని చాలా మందికి తెలియ‌దు. దాని వివ‌రాలేంటో ఇక్క‌డ తెలుసుకుందాం.

 1. 100 శాతం ప్లేస్‌మెంట్స్‌

1. 100 శాతం ప్లేస్‌మెంట్స్‌

దేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల్లో ఐఐటీలతో పోటీ ప‌డుతున్న సంస్థ హైద‌రాబాద్ ఐఐఐటీ. ఇది గ‌చ్చిబౌలిలో ఉంది. అప్ప‌ట్లో ఏఐఈఈఈ ద్వారా దీనిలో ప్ర‌వేశాలు జ‌రిపేవారు. ఇప్పుడు దేశ‌వ్యాప్త ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగానే దీనిలో అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఇక్క‌డ వ‌చ్చే వేత‌నాలు రూ.13.4 ల‌క్ష‌ల నుంచి మొద‌లుకొని 18.8 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉన్నాయి. అదే ఐటీలో మాస్ట‌ర్స్ పూర్తిచేసిన వారైతే రూ.14 లక్ష‌ల నుంచి రూ.17.7 ల‌క్ష‌ల వ‌ర‌కూ వార్షిక ప్యాకేజీల‌ను అందుకుంటున్నారు. 16 కంపెనీలు ప్లేస్‌మెంట్లు నిర్వ‌హించేందుకు రిజిస్ట‌ర్ అయితే 100 శాతం విద్యార్థుల‌కు ఉద్యోగం క‌చ్చితంగా వ‌స్తుంద‌ని ఐఐఐటీ యాజ‌మాన్యం తెలిపింది.

2. నెల‌కు క‌నీస వేత‌నం రూ.1 లక్ష నుంచి మొద‌లు

2. నెల‌కు క‌నీస వేత‌నం రూ.1 లక్ష నుంచి మొద‌లు

ఏ విభాగంలో విద్య పూర్తిచేసినా నెల‌కు క‌నీసం రూ.1 ల‌క్ష వేత‌నం వ‌చ్చే జాబ్ తెచ్చుకుంటారు ఇక్క‌డి విద్యార్థులు. స‌గ‌టున చూస్తే ఇక్క‌డ టాప్ కంపెనీలు ఆఫ‌ర్ చేసే వార్షిక ప్యాకేజీలు రూ.14 ల‌క్ష‌లు-రూ.17.7 ల‌క్ష‌ల మ‌ధ్య‌నే ఉంటున్నాయ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. ప్రాడ‌క్ట్ ఆధారిత ప‌రిశ్ర‌మ‌లు, టెక్నాల‌జీ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల్లో చేరేందుకు అక్క‌డి విద్యార్థులు ఆస‌క్తి చూపుతున్నారంట‌.

3. స్నాత‌కోత్స‌వం

3. స్నాత‌కోత్స‌వం

ఐఐఐటీ-హైద‌రాబాద్ ఆగ‌స్టు 15న 16వ స్నాత‌కోత్స‌వం జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా 473 విద్యార్థుల‌కు డిగ్రీ పట్టాలు అందించారు. 16 పీహెచ్‌డీ వారితో క‌లుపుకుని 84 మంది విద్యార్థులు ప‌రిశోధ‌న‌ల్లో ఉండ‌గా వివిధ విభాగాల్లో పీజీ చేస్తున్న విద్యార్థులు కొంద‌రున్నారు. ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో జీవీ ప్ర‌సాద్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌రయ్యారు. ఐఐఐటీ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ రాజ్ రెడ్డీ ఆధ్వ‌ర్యంలో స్నాత‌కోత్స‌వం పూర్త‌యింది.

4. ఐఐఐటీ - హైర‌దాబాద్

4. ఐఐఐటీ - హైర‌దాబాద్

ఐఐఐటీ, హైర‌దాబాద్ 1998 సంవ‌త్స‌రంలో ఒక స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల సంస్థ‌గా ఏర్పాట‌యింది. లాభాపేక్ష ర‌హితంగా ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు భాగ‌స్వామ్యంలో ఇది ఏర్ప‌డింది. ఈ విధానంలో ఏర్ప‌డిన మొట్ట‌మొద‌టి ఐఐఐటీ ఇదే. భూమి, భ‌వ‌నాలు స‌మకూర్చ‌డం ద్వారా అప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దీనికి తోడ్పాటునందించింది. ఇక్క‌డ ఐటీలోని ముఖ్య రంగాలైన కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్‌, ఇత‌ర డొమైన్ ఆప్లికేష‌న్స్‌లో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతుంటాయి. వాస్త‌వ జీవితంలో ఎదురయ్యే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను వెదికేందుకు ఇక్క‌డ ప్రాథ‌మిక స్థాయిలో సైతం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతుండ‌టం విశేషం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+