2015-16కు గాను 264 మిలియన్ డాలర్లు (రూ.1,700 కోట్లు పైగా) జరిమానా విధించినట్లు చమురు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఉత్పత్తి లక్ష్యాన్ని చేరని రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామి బ్రిటిష్ పెట్రోలియం (బిపి) కంపెనీలు మరోమారు భారీ జరిమానాకు గురయ్యాయి. ఈశాన్యం లోని కెజి-డి6 క్షేత్రంలో ఆ కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చిన సహాజ వాయువు ఉత్పత్తి లక్ష్యాన్ని నెరవేర్చకపోవడంతో కేంద్రం ఈ చర్యకు దిగింది. 2015-16కు గాను 264 మిలియన్ డాలర్లు (రూ.1,700 కోట్లు పైగా) జరిమానా విధించినట్లు చమురు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

1. లక్ష్యాన్ని చేరని రిలయన్స్- జరిమానా విధించిన కేంద్రం
గత 6 సంవత్సరాల నుంచి ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఈ క్షేత్రంలో ఉత్పత్తి లక్ష్యాన్ని చేరలేకపోతోంది. 2010 ఏప్రిల్ ఒక్కటో తేది నుంచి ఇదే పరిస్థితి. దీంతో ఆ కంపెనీపై ఇప్పటి వరకు పడిన మొత్తం జరిమాన 3.2 బిలియన్ డాలర్లు (రూ.20వేల కోట్లకు పైగా) చేరుకుందని మంత్రిత్వ శాఖ సదరు అధికారి వెల్లడించారు.

2. జరిమానాలతో ప్రభుత్వానికి ఆదాయం
గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ, పెట్టుబడి వ్యయాలన్నింటీని రిలయన్స్ దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం, కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌లు వెనక్కి తీసుకునెందుకు ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు అనుమతిస్తోంది. ఆ తర్వాతే ప్రభుత్వంతో లాభాలను పంచుకోవాలని నిర్దేశిస్తుంది. తాజా జరిమానాలతో ప్రభుత్వానికి 175 మిలియన్ డాలర్ల మేర అధిక ఆదాయం లభించనుందని అంచనా.

3. రిలయన్స్ ఉత్పత్తిని తక్కువ చేసి చూపిస్తోందా!
కెజి-డి బ్లాక్‌లోని ధీరుబాయి-1, ధీరుబాయి-3 గ్యాస్ క్షేత్రాల్లో ప్రతీ రోజు 80 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు (ఎంఎస్‌ఎస్‌సిఎండి) గ్యాస్ ఉత్పత్తి చేపడు తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదట ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కాగా 2011 -12లో ఇది కేవలం 35.33 ఎంఎంఎస్ సిఎండి ఉత్పత్తిని మాత్రమే సాధించింది. 2012-13లో 20.88 ఎంఎంఎస్‌సి ఎండి, 2013-14లో 9.77 ఎంఎంఎస్ సిఎండిగా నమోదయ్యింది. ఇక్కడ ప్రతీ ఏడాది ఉత్పత్తి వరుసగా పడిపోతూ వస్తోంది. గ్యాస్ ధర పెంపు కోసం రిల యన్స్ ఉత్పత్తిని తక్కువ చేసి చూపిస్తోం దన్న ప్రధాన ఆరోపణలు ఉన్నాయి.

4. వరుస సంవత్సరాల్లో జరిమానాలు
ఉత్పత్తి లక్ష్యాన్ని నెరవేర్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ , దాని భాగస్వామ్య కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం వరుసగా 2010-11లో 457 మిలియన్ డాలర్లు, 2011-12లో 548 మిలియన్ డాలర్లు, 2012-13లో 792 మిలియన్ డాలర్లు, 2013-14లో 579 మిలియన్ డాలర్లు, 2014-15లో 380 మిలియన్ డాలర్లు, 2015-16లో 264 మిలియన్ డాలర్ల చొప్పున జరిమాన విధించింది. 2016-17కు గాను ఉత్పత్తి లక్ష్యం ఖరీదును వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం లెక్కించనుందని సదరు అధికారి తెలిపారు.

5. గ్యాస్ ధరలు పెంచాల్సిందిగా డిమాండ్
బంగాళాఖాతంలోని ఈ క్షేత్రంలో రిలయన్స్ ఇండిస్టీస్‌కు 60 శాతం వాటా ఉంది. దాని భాగస్వామ్య కంపెనీలు బ్రిటిష్ పెట్రోలియంకు 30 శాతం, నిక్కీకి 10 శాతం చొప్పున వాటాలున్నాయి. గత కొన్నేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ గ్యాస్ ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

6. నిజాన్ని నిగ్గు తేల్చిన షా కమిటీ
గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ధర 4 డాలర్లకు పైగా ఉంది. కేజీ బేసిన్‌లో ఒఎన్‌జీసీ గ్యాస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్రమంగా తోడుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఒఎన్‌జిసికి చెందిన బ్లాక్‌ల నుంచి రిలయన్స్ ఏడేళ్లుగా గ్యాస్‌ను తోడేసుకున్నట్లు జస్టిస్ ఏపీ షా కమిటీ తేల్చిచెప్పింది.

7. ఓఎన్జీసీకి రావాల్సిన మొత్తంపై ఉదాసీనత
ఇందుకుగాను ఒఎన్‌జీసీకి నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంది. కేజీ బేసిన్‌లో ఒఎన్‌జీసీకి ఉన్న గోదావరి-పిఎంఎల్, కెజి-డిడబ్ల్యూఎన్-98/2 బ్లాక్‌లు ఆర్‌ఐఎల్‌కు ఉన్న కేెజి-డి6 ప్రధాన క్షేత్రం పక్కనే ఉన్నాయి. వీటి నుంచి 2009 ఏప్రిల్ 1 నుంచి 2015, మార్చి 31 మధ్య కాలంలో ఆర్‌ఐఎల్ కెజి-డి6కు 11.122 బిలియన్ ఘనపు మీటర్ల మేర గ్యాస్ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డిఅండ్‌ఎం గతేడాది నవంబర్‌లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అప్పటి సహజ వాయువు ధరల(యూనిట్‌కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11,055 కోట్లు)గా లెక్కగట్టింది. ఓఎన్‌జీసీకి రావాల్సిన ఈ మొత్తం చెల్లింపులపై ప్రభుత్వ చొరవ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications