అయితే అందరూ ఎక్కువ రేట్లు పెట్టి స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు స్తోమత ఉండటం లేదు. సరిగ్గా అక్కడే ఏం చేయాలని రిలయన్స్ జియో ఆలోచించింది. ఆ తర్వాత విశ్లేషించి ఏం చేసిందో కింద తెలుసుకుందాం.
దేశ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో రాక తర్వాత 4జీ వాడకంలోనూ, మొబైల్ వాడకంలోనూ, డేటా వాడకంలోను చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు చాలా మంది 1జీబీ డేటా అంటే ఒక నెల వరకూ అతి జాగ్రత్తగా వాడుకునేవారు. ఇప్పుడు ఒక రోజుకు ఒక జీబీ డేటా సరిపోవడం లేదు. ఈ ప్రధాన మార్పుకు కారణం వీడియోలు ఎక్కువగా చూడటానికి అలవాటు పడటం. అయితే అందరూ ఎక్కువ రేట్లు పెట్టి స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు స్తోమత ఉండటం లేదు. సరిగ్గా అక్కడే ఏం చేయాలని రిలయన్స్ జియో ఆలోచించింది. ఆ తర్వాత విశ్లేషించి ఏం చేసిందో కింద తెలుసుకుందాం.

1. తక్కువ ధరలో ఎల్టీఈ ఫోన్లు
స్మార్ట్‌ఫోన్లలో ఎల్‌టీఈ టెక్నాలజీ ఈ మధ్యనే భారతదేశంలోకి వచ్చింది. ఈ టెక్నాలజీ ఉన్న ఫోన్ల ద్వారా డేటా ఉపయోగించి ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. దాన్నే ప్రధాన ఆయుధంగా జియో ఎంచుకుంది. తక్కువ రేట్లలో ఎల్‌టీఈ,వీఓఎల్‌టీఈ ఫోన్లను తయారుచేయించే పనిలో పడింది.

2. రూ.1000 నుంచి రూ.1500 లోపే
దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్లలో 2జీ ఫోన్లే వాడుతున్నారు. వారిననే లక్ష్యంగా జియో ముందుకు సాగుతోంది. ఇదివరకే స్మార్ట్‌ఫోన్ వాడేవారంత 4జీ లోకి రావాలనేది ప్రణాళిక. వచ్చే రెండేళ్లలో రూ.1000 నుంచి రూ.1500 ధర లోపు 20 కోట్ల ఫోన్లను అమ్మాలని రిలయన్స్ లక్ష్యిస్తోందని పీటీఐ వార్తా కథనం వెలువరించింది.

3. ఈ ఫోన్లు ఎప్పుడు వస్తున్నాయి?
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్బంగా ఆగస్టు 15న కొత్త ఫోన్ అమ్మకాలు మొదలుపెడతామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆగస్టు రెండో వారంలో కంపెనీ ఆ ఫోన్లను ప్రవేశపెడతామని కంపెనీ సైతం తెలిపింది. అయితే ఈ ఫోన్లు రిలయన్స్ రిటైల్ ద్వారా లేదా జియో ద్వారా అమ్ముతారనే విషయం ఇంకా తెలియదు.

4. ధర సంగతి, ఫోన్‌లో ఏముంటాయి?
ఇప్పుడు కనీసం 4 నుంచి 5 వేలు ఖర్చు చేస్తేనే మంచి స్మార్ట్‌ఫోన్ వస్తున్నది. అయితే గ్రామీణ ప్రజలు, పట్టణ మధ్య తరగతి ఇంత పెట్టి 4జీ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనేందుకు మొగ్గుచూపరు. అందుకే రిలయన్స్ తక్కువ ధరలో ఫోన్ ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఒక్కో ఫోన్ ధర రూ.1000 నుంచి రూ.1500 మధ్య ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు చెప్పారు. ఈ తక్కువ ధర 4జీ ఫోన్‌లో జియో టీవీ, జియో మనీ వంటి ప్రీ లోడెడ్ యాప్‌లు ఉంటాయి.

5. లక్ష్యం 2జీ యూజర్లేనా...
ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొనలేక, కాల్ రేట్లకు ఎక్కువ చెల్లించే 2జీ వినియోగదారులపై రిలయన్స్ జియో కన్నేసినట్లు టెలికాం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫోన్ల తయారీకి సంబంధించి రెండు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఫోక్స్‌కాన్, ఇంటెక్స్ ఫోన్లను దిగుమతి చేసుకునే ఆలోచన ఉన్నా భవిష్యత్తులో ఇక్కడే తయారీ జరిగే విధంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

6. మొదట కోటితో మొదలు... మొత్తం లక్ష్యం 20 కోట్లు
మొదట ప్రాథమిక దశలో 1 కోటి ఫోన్లను దిగుమతి చేసుకుని అమ్మే విధంగా ప్లాన్ ఉంది. ఫోన్లు అమ్మడం ప్రారంభమైన తర్వాత మొదటి ఏడాది కాలంలో 10 కోట్ల ఫోన్లను, ఆ తర్వాతి సంవత్సరం మరో 10 కోట్ల ఫోన్లను అమ్ముతారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతినిధులు చెప్పారు.

7. పరిశ్రమ గణాంకాలు
ఇండియన్ సెల్యూలార్ అసోషియేషన్ ప్రభుత్వానికి ఫోన్ల మార్కెట్‌పై ఒక నివేదిక సమర్పించింది. దాని ప్రకారం 2016లో 28 కోట్లుగా మొబైల్ ఫోన్ మార్కెట్ 2018 నాటికి 32 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications