For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌ద‌ర్‌స‌న్ మొద‌టి త్రైమాసిక లాభాలు త‌గ్గాయ్‌

వాహ‌న త‌యారీ కంపెనీ మ‌ద‌ర్‌స‌న్ సుమీ జూన్ 30,2017తో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత నిక‌ర లాభంలో రూ. 347.32 కోట్ల త‌గ్గుద‌ల‌ను న‌మోదు చేసింది.

|

వాహ‌న త‌యారీ కంపెనీ మ‌ద‌ర్‌స‌న్ సుమీ జూన్ 30,2017తో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత నిక‌ర లాభంలో రూ. 347.32 కోట్ల త‌గ్గుద‌ల‌ను న‌మోదు చేసింది. అంత‌కుముందు త్రైమాసికంలోని రూ.439.36 కోట్ల‌తో పోలిస్తే ఇది 20.95% త‌క్కువ‌. గ‌తేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం అమ్మ‌కాల విలువ రూ.10,626.27 కోట్ల మేర ఉండ‌గా, ఈసారి త్రైమాసికంలో 24.17% వృద్దితో రూ.13,194.80 కోట్ల‌కు పెరిగింది.

 మ‌ద‌ర్‌స‌న్ సుమీ త్రైమాసిక ఫ‌లితాలు

కంపెనీకి సంబంధించి మ‌న దేశంలో 2017-18 మొద‌టి త్రైమాసికంలో స్థూల అమ్మ‌కాలు రూ.1824.97 కోట్లుగా ఉన్నాయి. ఇంత‌కు ముందు ఆర్థిక సంవ‌త్స‌రం అదే త్రైమాసికంలో ఇవి రూ.1465.98 కోట్ల మేర ఉన్నాయి. అదే భార‌త‌దేశానికి వెలుప‌ల క్రితం ఏడాది అమ్మ‌కాలు రూ.9060 కోట్లుండ‌గా ఈసారి రూ.11,369.83 కోట్ల‌కు పెరిగాయి.
ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 ప్లాంట్ల నిర్మాణం వివిధ ద‌శ‌ల్లో ఉండ‌గా, అందులో మూడు ప్లాంట్ల నిర్మాణం పూర్త‌యిన‌ట్లు మ‌ద‌ర్‌స‌న్ తెలిపింది. డిసెంబ‌రు 2016 త్రైమాసికం త‌ర్వాత రెండు ప్లాంట్లు ప‌నిచేయ‌డం ప్రారంభించాయ‌ని కంపెనీ పేర్కొంది.

Read more about: results motheson sumi
English summary

మ‌ద‌ర్‌స‌న్ మొద‌టి త్రైమాసిక లాభాలు త‌గ్గాయ్‌ | motherson sumi profit fallen in the first quarter of 2018

Auto component major Motherson Sumi Systems Ltd on Thursday reported a 20.95 per cent decline in consolidated net profit at Rs. 347.32 crore for the first quarter that ended on June 30, 2017
Story first published: Thursday, August 10, 2017, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X