For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూపీఐ ద్వారా లావాదేవీల జంప్‌... నోట్ల ర‌ద్దుకు ముందు,త‌ర్వాత‌

నోట్ల మార్పిడి/ర‌ద్దు జ‌ర‌గడానికి ముందే ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు యూపీఐ అనే మొబైల్ యాప్‌ని ప‌రిచ‌యం చేసింది. చాలా మంది ఈ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడ‌టం మొద‌లుపెట్టారు. యూపీఐ సంబంధిత విధానం, నోట్ల ర‌ద

|

ప్ర‌భుత్వం అయితే హ‌ఠాత్తుగా, ప‌క‌డ్బందీగా పెద్ద నోట్ల‌ మార్పిడి/ర‌ద్దు చేసింది. గతేడాది న‌వంబ‌రు, డిసెంబ‌రు నెల‌లో వ్య‌వస్థ‌లో త‌గినంత‌ క‌రెన్సీ లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డారు. ఈ స‌మ‌యంలో పెద్ద ఎత్తున డిజిట‌ల్ లావాదేవీలు జ‌రిగాయి. ఈ లావాదేవీలు వేగ‌వంతంగా, ఎటువంటి త‌ప్పులు లేకుండా జ‌రిగేందుకు కార‌ణ‌మైంది నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ). ఇది ఆర్బీఐ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే సంస్థ‌. నోట్ల మార్పిడి/ర‌ద్దు జ‌ర‌గడానికి ముందే ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు యూపీఐ అనే మొబైల్ యాప్‌ని ప‌రిచ‌యం చేసింది. చాలా మంది ఈ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడ‌టం మొద‌లుపెట్టారు. యూపీఐ సంబంధిత విధానం, నోట్ల ర‌ద్దుకు ముందు, నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసుకుందాం.

1. మొబైల్ ఆధారిత చెల్లింపులు

1. మొబైల్ ఆధారిత చెల్లింపులు

స్మార్ట్‌ఫోన్ నుంచే నేరుగా పేమెంట్లు చేసేందుకు వీలుగా యాపీఐ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో కేవ‌లం ఈ-మెయిల్ ఐడీ లాంటి ఒక అడ్ర‌స్ క్రియేట్ చేసుకుంటే మీరు ఎవ‌రినైనా డ‌బ్బులు రిక్వెస్ట్ చేయ‌వ‌చ్చు. మీరు కూడా సులువుగా, వేగంగా డ‌బ్బులు పొంద‌వ‌చ్చు. కేవ‌లం ఏడాది కాలంలోనే ఇది బాగా ప్రాచుర్యం పొందింది. గ‌తేడాది సెప్టెంబ‌రులో కేవ‌లం ల‌క్ష ఉన్న లావాదేవీల సంఖ్య జులై నెల‌కు ఒక కోటిని దాటింది.

2. యూపీఐ

2. యూపీఐ

మొబైల్లో ఇంట‌ర్నెట్ ఉంటే వేగంగా చెల్లింపులు జ‌రిపేందుకు ఉప‌యోగ‌ప‌డే ఒక విధానం యూపీఐ. ఆగ‌స్టు 1న ఆర్‌బీఐ ఎల‌క్ట్రానిక్ చెల్లింపుల‌పై ప‌లు గణాంకాల‌ను వెలువ‌రించింది. అందులో మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ గురించి కొన్ని వివ‌రాలు ఉన్నాయి. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల‌కు సంబంధించి ఆర్‌బీఐ వ‌ద్ద ఐదు బ్యాంకుల‌కు సంబంధించి ఉన్న లెక్క‌ల ప్ర‌కారం, న‌వంబ‌రు 2016లో లావాదేవీల సంఖ్య 7.23 కోట్లుండ‌గా, జులై నాటికి 6.02 కోట్లుగా ఉన్నాయి.

ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, ఎంఎంఐడీ లేకుండానే బ్యాంకు ఖాతాల‌కు న‌గ‌దు బ‌దిలీ- యూపీఐ ద్వారా

మొత్తం యూపీఐ ఆధారిత లావాదేవీల సంఖ్య మాత్రం న‌వంబ‌రు 2016లో 1.09 కోట్లుండ‌గా జూన్‌, 2017 నాటికి 1.09 కోట్ల‌కు పెరిగాయి.

3. నోట్ల మార్పిడి/ ర‌ద్దుకు ముందు

3. నోట్ల మార్పిడి/ ర‌ద్దుకు ముందు

నోట్ల ర‌ద్దుకు ముందే ఆర్‌బీఐ డిజిట‌ల్ లావాదేవీల‌పై పెద్ద ఎత్తున దృష్టి సారించింది. మొద‌ట 2012 నుంచే ఎన్‌పీసీఐ నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐంఎమ్‌పీఎస్‌ల‌ను పెద్ద ఎత్తును విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నించి స‌ఫ‌ల‌మైంది. త‌ర్వాత యూపీఐ విధానాన్ని గ‌తేడాది ప్ర‌వేశ‌పెట్టారు. 2016 సెప్టెంబ‌రు నెల‌లో యూపీఐ లావాదేవీలు 1.22 ల‌క్ష‌లుగా ఉన్నాయి. కొన్ని బ్యాంకులు యూపీఐ కోసం ప్ర‌త్యేక యాప్‌ల‌ను రూపొందించ‌గా, మ‌రికొన్ని బ్యాంకులు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లోనే ప్ర‌త్యేక ఆప్ష‌న్ ఇచ్చాయి.

4. నోట్ల మార్పిడి/ ర‌ద్దు త‌ర్వాత‌

4. నోట్ల మార్పిడి/ ర‌ద్దు త‌ర్వాత‌

న‌వంబ‌రు 8న నోట్ల ర‌ద్దు జ‌రిగిన త‌ర్వాత డిజిట‌ల్ లావాదేవీల‌కు ఒక్క‌సారిగా ఆద‌ర‌ణ పెరిగింది. అదే స‌మ‌యంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు చాలా రెట్లు పెర‌గడం ఆరంభ‌మైంది. అదే విధంగా యాపీఐని ఆధారంగా చేసుకుని ప‌నిచేసే భీమ్ యాప్‌ను డిసెంబ‌రు 30,2016న ఎన్‌పీసీఐ ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్‌బీఐ స‌మాచారం ప్ర‌కారం యూపీఐ లావాదేవీలు న‌వంబ‌రు, డిసెంబ‌రు, 2017 జ‌న‌వ‌రి నెల్ల‌లో వ‌రుస‌గా 3ల‌క్ష‌లు, 20 ల‌క్ష‌లు, 42 ల‌క్ష‌లు చొప్పున పెరుగుతూ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం 52 బ్యాంకులు యూపీఐని అందుబాటులో ఉంచాయి. ఎన్‌పీసీఐ వద్ద ఉన్న డేటా ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా భీమ్ యాప్ డౌన్‌లోడ్లు 1.6 కోట్ల‌ను దాట‌గా, జూన్ చివ‌రి నాటికి 40 ల‌క్ష‌ల మంది భీమ్‌ను త‌రుచూ వాడుతున్నారు.

Read more about: upi digital online
English summary

యూపీఐ ద్వారా లావాదేవీల జంప్‌... నోట్ల ర‌ద్దుకు ముందు,త‌ర్వాత‌ | From A few lakhs to over a crore digital transactions of UPI

The number of transactions on the UPI platform has surged over the last one year — from just over one lakh last September, it crossed one crore this July.
Story first published: Thursday, August 10, 2017, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X