ఒక ఆర్థిక సలహాలిచ్చే వెబ్‌సైట్‌గా గుడ్‌రిటర్న్స్ తరపున వివిధ ప్లాన్ల ద్వారా ఏ కంపెనీ ఏ విధమైన ప్రయోజనాలను మీ కోసం అందిస్తున్నాం. ఆగస్టు నెలకు సంబంధించి టెలికాం రంగంలో ఉన్న ఉత్తమ ప్లాన్లను
మొబైల్ వాడకం దారుల్లో ఎక్కువగా ఉన్న మధ్య తరగతి వారు ప్రతినెలా ఎంత బిల్లు ఆదా చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం చందాదారులంతా ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు పోర్ట్ అవడం ఎక్కువైంది. రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు వీలుగా దేశీయ టెలికాం దిగ్గజాలను తమవైన ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి టెలికాం రంగంలో ఉన్న ఉత్తమ ప్లాన్లను తెలుసుకోండి.

1. రిలయన్స్ జియో రూ.399 ప్లాన్
రిలయన్స్ ఏడాది ఆఫర్ తర్వాత సమ్మర్ ప్లాన్‌తో వచ్చింది. తర్వాత జియో ధన్ ధనా ధన్ ఆపర్‌ను ప్రకటించింది. అది కూడా ముగిసిన తర్వాత రూ.399 ప్లాన్‌ను ఎక్కువ మందిని ఆకట్టుకునే విధంగా అందుబాటులో ఉంచింది. దీని ద్వారా 84 రోజుల పాటు
ప్లాన్ : రూ.399
వాలిడిటీ: 84 రోజులు
డేటా: 1జీబీ/ ప‌్రతి రోజూ

2. భారతీ ఎయిర్‌టెల్
దేశీయ టెలికాం దిగ్గజంగా ఉన్న ఎయిర్‌టెల్ రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు అదే ధరలో ప్లాన్‌ను తీసుకొచ్చింది. సేమ్ టు సేమ్ రిలయన్స్ జియో అందించే ప్రయోజనాలను ఇదీ అందిస్తోంది.
ప్లాన్ : రూ.399
వాలిడిటీ: 84 రోజులు
డేటా: 1జీబీ/ ప‌్రతి రోజూ

3. వివిధ ప్లాన్లతో ఐడియా సెల్యూలార్
టెలికాంలో ధరల యుద్దం సందర్భంగా మార్చి నెలలో ఐడియా రూ.297 రీచార్జీని తీసుకొచ్చింది. రోజుకు ఒక జీబీ చొప్పున 70 రోజుల 4జీ డేటా వస్తుంది. ఒక రోజుకు 300 ఉచిత నిమిషాలు, వారానికి 1200 ఉచిత నిమిషాల పరిమితి ఉంది.
ఒకటో ప్లాన్ : రూ. 357
వాలిడిటీ: 28 రోజులు
డేటా: 1జీబీ/ ప‌్రతి రోజూ
రెండో ప్లాన్: రూ. 697
వాలిడిటీ: 84 రోజులు
డేటా: 1.5జీబీ/ ప‌్రతి రోజూ
మూడో ప్లాన్ :రూ. 897
వాలిడిటీ: 84 రోజులు
డేటా: 2జీబీ/ ప‌్రతి రోజూ

4. వోడాఫోన్
ఐడియాకు చాలా టెలికాం సర్కిళ్లలో 4జీ నెట్‌వర్క్ ఉంది. అయితే వోడాఫోన్‌కు దేశవ్యాప్తంగా 4జీ విస్తరణ పెద్దగా లేదు. వోడాఫోన్ అందుకే 3జీ లేదా 4జీ డేటా ఇస్తున్నది. కాల్స్ సైతం వోడాఫోన్ నుంచి వోడాఫోన్‌కు అపరిమితం. ఇప్పుడున్న వోడాఫోన్ కస్టమర్లలో 4జీ డేటాకు మారిన వారికి కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.346 ప్లాన్ ద్వారా 1జీబీ డేటా ప్రతి రోజూ ఇవ్వడంతో పాటు 56 రోజుల పాటు కొన్ని ఉచిత నిమిషాలు ఇస్తోంది.
ప్లాన్ 1: రూ. 244
వాలిడిటీ: 70 రోజులు
డేటా: 1జీబీ/ ప‌్రతి రోజూ
మరో ప్లాన్ : రూ. 346
వాలిడిటీ: 56 రోజులు
డేటా: 1జీబీ/ ప‌్రతి రోజూ
కాల్స్: ప‌్రతి రోజు 300, వారానికి 12000

5. బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సైతం జియో పోటీని తట్టుకునేందుకు ప్రయివేటు ఆపరేటర్ల లాగా ఆఫర్లను వదులుతోంది.
ప్లాన్1 : రూ. 259
వాలిడిటీ: 30 రోజులు
బెనిఫిట్: 220 టాక్ టైమ్+ 110 బీఎస్ఎన్ఎల్ ఉచిత నిమిషాలు
ప్లాన్2 : రూ. 378
వాలిడిటీ: 30 రోజులు
డేటా: 4జీబీ/ ప‌్రతి రోజూ
ప్లాన్ 3: రూ. 548
వాలిడిటీ: 90 రోజులు
డేటా: 5జీబీ/ ప‌్రతి రోజూ

6. ఎయిర్‌సెల్
ప్లాన్: రూ. 333
వాలిడిటీ: 30 రోజులు
డేటా: 30జీబీ
ప్లాన్ 2: రూ. 348
వాలిడిటీ: 84 రోజులు
డేటా: 1జీబీ/ ప‌్రతి రోజూ

జియో ప్రభావం
రిలయన్స్ జియో ధనాధన్ తర్వాత కూడా ఏదో పేరుతో 3 నెలల పాటు ప్రతి రోజూ 1జీబీ వచ్చేలా వివిధ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక పరిమితికి మించి ఏ ప్లాన్ తీసుకున్నా రిలయన్స్ జియో అపరిమితి కాల్స్ ఉచితం ఇవ్వడం ఇక్కడ పేర్కొనదగిన అంశం. నాణ్యత, ధర అనేది రెండో అంశం అయిపోయింది జియో విస్తరణ మొదలైనప్పటి నుంచి. ఎందుకంటే రిలయన్స్ జియో మొదటి లక్ష్యం మార్కెట్ వాటా చేజిక్కుంచుకోవడం. మరో వైపు మొబైల్ వాడకం దారుల్లో ఎక్కువగా ఉన్న మధ్య తరగతి వారు ప్రతినెలా ఎంత బిల్లు ఆదా చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం చందాదారులంతా ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు పోర్ట్ అవడం ఎక్కువైంది. రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు వీలుగా దేశీయ టెలికాం దిగ్గజాలను తమవైన ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఒక ఆర్థిక సలహాలిచ్చే వెబ్‌సైట్‌గా గుడ్‌రిటర్న్స్ తరపున వివిధ ప్లాన్ల ద్వారా ఏ కంపెనీ ఏ విధమైన ప్రయోజనాలను మీ కోసం అందిస్తున్నాం. ఆగస్టు నెలకు సంబంధించి టెలికాం రంగంలో ఉన్న ఉత్తమ ప్లాన్లను తెలుసుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications