సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా ఇప్పటి దాకా రూ.6030 కోట్ల సేకరణ
సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.6,030 కోట్ల విలువైన పెట్టుబడులను సమీకరించగలిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.
సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.6,030 కోట్ల విలువైన పెట్టుబడులను సమీకరించగలిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 28న జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి ట్రేడింగ్ మంగళవారం నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో మొదలైన సందర్భంలో ఆర్‌బీఐ తాజా ప్రకటన విడుదల చేసింది. 2015 నవంబర్ 5న తొలిసారిగా కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. జూలై సిరిస్‌కు ముందు, ప్రభుత్వం 8 సార్లు విడుదల చేసిన సిరీస్ ఆఫ్ బాండ్ల నుంచి మొత్తం రూ.5,400 కోట్ల వరకూ నిధుల సేకరణ జరిగింది.

ప్రజలు ఆభరణాల రూపంలో దాచుకునే భౌతిక రూపంలోని బంగారు డిమాండ్‌ను తగ్గించడం, ఈ మొత్తాలను పొదుపులుగా మళ్లించి ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయడం సార్వభౌమ(సావరిన్) బంగారం బాండ్ల ప్రధాన ఉద్దేశం. బంగారం బాండ్లలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్ర ఇటీవలే ఒక కీలక నిర్ణయమూ తీసుకుంది. సావరిన్ గోల్డ్ బాండ్లలో (ఎస్‌జీబీ) వార్షిక పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం 500 గ్రాముల మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుండగా... దాన్ని ఒక్కసారిగా 4 కిలోలకు పెంచింది. ఈ పథకం ద్వారా 2015-16, 2016-17లో రూ.25,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యమైనా, ఇది నెరవేరకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications