For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

210 పాయింట్ల‌కు పైన సెన్సెక్స్‌

వ‌రుస‌గా మూడో రోజు దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. హెల్త్ కేర్‌, ఆర్థిక రంగ షేర్లపై ప‌డిన ప్ర‌తికూల ప్ర‌భావంతో పాటు, ఉత్త‌ర‌కొరియా మ‌రియు అగ్ర రాజ్యం అమెరికా మ‌ధ్య నెల‌కొన్న ప్ర‌చ్చ‌న్న యుద్ద

|

వ‌రుస‌గా మూడో రోజు దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. హెల్త్ కేర్‌, ఆర్థిక రంగ షేర్లపై ప‌డిన ప్ర‌తికూల ప్ర‌భావంతో పాటు, ఉత్త‌ర‌కొరియా మ‌రియు అగ్ర రాజ్యం అమెరికా మ‌ధ్య నెల‌కొన్న ప్ర‌చ్చ‌న్న యుద్ద ప‌రిస్తితుల కార‌ణంగా మార్కెట్లలో నిస్తేజం నెల‌కొంది.

 న‌ష్టాల్లో మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు(0.68%) న‌ష్ట‌పోయి మూడు వారాల క‌నిష్టం 31,797.84 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిప్టీ 70.5 పాయింట్లు క్షీణించి 9908 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీకి జులై 21 త‌ర్వాత ఇదే క‌నిష్టం.
బీఎస్ఈ సూచీలో రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్(3.73%), ఆటో(1.68%), మూల‌ధ‌న వ‌స్తువులు(1.1%), మౌలిక రంగం(1.05%) ప‌డిపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో హిందాల్కో(1.94%), ఎన్‌టీపీసీ(1.46%), ఓఎన్‌జీసీ(1.04%), వేదాంతా(0.84%), ఏసియ‌న్ పెయింట్స్‌(0.71%) ముందుండ‌గా, అర‌బిందో ఫార్మా(5.88%), స‌న్‌ఫార్మా(5.2%), అదానీ(4.23%), టాటా మోటార్స్‌(3.24%), ఇండియా బుల్స్ హౌసింగ్‌(3.08%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

210 పాయింట్ల‌కు పైన సెన్సెక్స్‌ | Sensex plunges 216 points for the third consecutive day

The Sensex and Nifty ended lower on Wednesday, their third straight session of falls, dragged down by healthcare and financial stocks amid mounting tensions between the United States and North Korea.
Story first published: Wednesday, August 9, 2017, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X