ఆర్‌బీఐ సర్వే ప్రభుత్వానికి మేలు కొలుపు కావాలి...
ఆర్‌బీఐ జూన్,2017లో జరిపిన సర్వే విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది. ఆదాయం పెరుగుదల, ఉద్యోగిత, ఆర్థిక స్థితిగతుల పరంగా ప్రజలు ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరని తెలిపింది. ఈ సర్వేలో వెల్
ఆర్‌బీఐ జూన్,2017లో జరిపిన సర్వే విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది. ఆదాయం పెరుగుదల, ఉద్యోగిత, ఆర్థిక స్థితిగతుల పరంగా ప్రజలు ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరని తెలిపింది. ఈ సర్వేలో వెల్లడైన మరిన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.

1. వేతనాల్లో పెరుగుదల, ఆదాయంపై సర్వే
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలే ప్రభుత్వానికి ముఖ్యం. వారి ఉద్యోగాల్లో వేతనాల పెరుగుదల, ఆదాయం మంచిగా ఉండటం వంటివి జరిగితే ప్రజలు సంతోషంగా ఉండటం పరిపాటే. అయితే చరిత్రను చూస్తే ఏ ప్రభుత్వానికైనా ప్రజలకు కనీస అవసరాలను తీర్చడం ముఖ్యం. ఏ విధంగా చూసినా ఆర్థిక అంశాలు ప్రజల అభిప్రాయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఈ వివరణలన్నీ ఎందుకంటే ఇటీవల జరిగిన ఆర్‌బీఐ సర్వే నుంచి వచ్చిన ప్రజాభిప్రాయం కేంద్రప్రభుత్వానికి మేలుకొలుపు కావాలని.

2.ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు
ప్రజలకు నిత్యం తమ అవసరాలు గడిచేందుకు డబ్బు కావాలి. అంటే ఆదాయం ద్వారానే ఎవరైనా నెట్టుకురాగలుగుతారు. అదే విధంగా ద్రవ్యోల్బణం కారణంతో ఏటా ఆదాయం పెరగాలి. అందుకే ఆర్‌బీఐ నిత్యం వినియోగదారు అవసరాలు, అభిప్రాయాల ప్రాతిపదికగా గణాంకాలను సేకరిస్తుంది. ఆ విధంగా జూన్ 2017లో ఆర్బీఐ చేసిన సర్వేను చూస్తే ఆదాయం పెరుగుదలపై జనాలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. డిసెంబరు 2013 నుంచి మార్చి 2014 మధ్య సంభవించిన ఆదాయ పెరుగుదలతో చూస్తే, గతేడాదితో చూస్తే ఆ సంవత్సరం తమ ఆదాయంలో పెరుగుదల నామమాత్రమేనని చెప్పారు. గత ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం పెరిగిందా అని అడిగిన ప్రశ్నకు, తగ్గిందనే ఎక్కువ మంది చెప్పడం గమనార్హం.

3. వినియోగదారు సర్వే
ఈ వినియోగదారులపై జరిపే సర్వే కోసం బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత, ముంబయి, న్యూఢిల్లీ నగరాలను ఎంచుకున్నారు. తమ ఉద్యోగాల్లో మెరుగుదల గురించి అడగ్గా గతేడాదితో పోలిస్తే బాగుందన్న వారి కంటే, గతేడాది కంటే దిగజారిందనే వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇది ఉద్యోగిత గురించి వెల్లడైన సత్యం. అంతే కాకుండా మార్చి, 2014లో ఉన్న దాని కంటే ఉద్యోగ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పిన వారి శాతం ఎక్కువ. ఇంకా శోచనీయమైన విషయం ఏమిటంటే వరుసగా గత ఆరు త్రైమాసికాల నుంచి ఇది ప్రతికూలంగా వస్తుండటమే. కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక విధమైన హెచ్చరిక కాగలదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

4. 2014 కంటే ఎక్కువ
ఆర్‌బీఐ సర్వే వెల్లడించిన దానిలో బయటపడిన మంచి విషయం ద్రవ్యోల్బణం సంబంధించి వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టడం. అందుకే మొత్తంగా ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులు 2013 లేదా 2014 ప్రథమార్థంక కంటే దిగజారినట్లు ఉండటం. నికరంగా చూస్తే గతేడాది కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మేలు అన్న వాళ్లకంటే ఇప్పుడు బాగోలేదు అన్నవాళ్లే ఎక్కువ. గత సంవత్సర కాలంగా ఆర్థిక స్థితి దిగజారింది అన్న వాళ్ల సంఖ్య మార్చి, 2014 నాటి కంటే ఎక్కువగా ఉండటం ప్రభుత్వానికి మంచిది కాదు.

5. పారిశ్రామికంగా
ఆర్‌బీఐ సర్వే-పారిశ్రామిక ప్రగతి అనేది తయారీ రంగ స్థితిగతులను బయటపెడుతుంది. తయారీ రంగంలో అయితే ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ అంతకుముందు యూపీఏ చివరి నాళ్లలో ఉన్నంత దారుణంగా లేదన్నది మంచి విషయం. అయితే దీన్ని ఎంతో సానుకూలంగా తీసుకునేందుకు సైతం వీల్లేదు. ఎందుకంటే జూన్, 2017లో ఉద్యోగితలో పెరుగుదల మార్చి,2014 కంటే తక్కువ.

6. భవిష్యత్తుపై ఆశ
ఇప్పటికైతే తమ ఆదాయ పరిస్థితులు మెరుగ్గా లేనప్పటికీ రానున్న కాలంలో బాగుంటుందన్న ఆశాభావం మాత్రం చాలా మందిలో ఉంది. జూన్ 2017 సర్వేలో పాల్గొన్న వారిలో వచ్చే ఏడాదిలో తమ ఆదాయం బాగా ఉంటుందన్న భరోసాతో 37.7% మంది ఉన్నారు. పోల్చి చూడాలంటే, డిసెంబరు,2013 నాడు 37.2% మంది ఏడాదిలో తమ ఆదాయాలు పెరుగుతాయని భరోసా వ్యక్తం చేశారు. ఈ రెండంకెలు దాదాపుగా సరిసమానంగా ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది కాలంలో తమ ఆదాయం పెరుగుతుందన్న నమ్మకంతో 37.7% మంది చెప్పినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే తమ ఆదాయ పెరిగిందని కేవలం 1.4% మాత్రమే చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం.

7. ఆర్థిక వేత్తలు
పెట్టుబడి డిమాండ్‌లో చెప్పుకోదగ్గ పురోగతి కనిపిస్తేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకునే స్థితి నెలకొంటుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అయితే పెట్టుబడి మూలధనం త్వరలో పుంజుకుంటుందా? దాని కోసం
సైతం ఆర్‌బీఐ వృత్తిగత భవిష్యత్ అంచనా సర్వేపైనే ఆధారపడాలి. ఇక్కడ ముఖ్యమైనది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్(జీఎఫ్‌సీఎఫ్)- అంటే స్థూల స్థిర మూలధన కల్పన. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఈ జీఎఫ్‌సీఎఫ్ జీడీపీలో 29% గా(ప్రస్తుత మార్కెట్ ధరల్లో) ఉంది. 2013-14 సంవత్సరంలో ఈ జీఎఫ్‌సీఎఫ్ జీడీపీలో 31.3%గా ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ పెరుగుతుందనే నమ్మకం ఉన్నప్పటికీ అది చాలా నెమ్మదిగా జరుగుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications