For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్సాహంగా మొద‌లై.. నీర‌సంగా ముగిసి

ఉద‌యం ఉత్సాహంగానే ప్రారంభ‌మైన మార్కెట్లు చివ‌రికి న‌ష్టాల‌తోనే ముగిశాయి. బోగ‌స్ కంపెనీల విష‌య‌మై లిస్టెడ్ కంపెనీల‌పై సెబీ కొన్ని నిషేధాజ్ఞలు విధించ‌డంతో మార్కెట్ల‌కు షాక్ త‌గిలింది.

|

ఉద‌యం ఉత్సాహంగానే ప్రారంభ‌మైన మార్కెట్లు చివ‌రికి న‌ష్టాల‌తోనే ముగిశాయి. బోగ‌స్ కంపెనీల విష‌య‌మై లిస్టెడ్ కంపెనీల‌పై సెబీ కొన్ని నిషేధాజ్ఞలు విధించ‌డంతో మార్కెట్ల‌కు షాక్ త‌గిలింది. ఈ నిర్ణ‌యం ప్ర‌భావం మార్కెట్ల‌ను తాకినప్ప‌టి నుంచి చివ‌రిదాకా న‌ష్టాల్లోనే కొన‌సాగాయి. మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 259 పాయింట్లు న‌ష్ట‌పోయి 32,014 వ‌ద్ద‌, నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 9979 వ‌ద్ద స్థిరప‌డింది.

న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(4.22%), చ‌మురు,స‌హ‌జ వాయు(1.99%), పీఎస్‌యూ(1.97%), ప‌వ‌ర్‌(1.97%) ప‌డిపోగా, కేవ‌లం లోహ రంగం మాత్రం 1.62% పుంజుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్లో కంపెనీల వారీగా చూస్తే డాక్ట‌ర్ రెడ్డీస్(5%), కోల్ ఇండియా(2.79%), ఐటీసీ(2.21%) ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1.82%), ప‌వ‌ర్ గ్రిడ్‌(1.7%) న‌ష్ట‌పోగా; మ‌రో వైపు లాభ‌ప‌డిన వాటిలో టాటా స్టీల్‌(2.48%), సిప్లా(2.42%), బ‌జాజ్ ఆటో(0.97%), హెచ్‌యూఎల్(0.24%), అదానీ పోర్ట్స్(0.23%) ఉన్నాయి.

English summary

ఉత్సాహంగా మొద‌లై.. నీర‌సంగా ముగిసి | Indices slipped as sebi is cracking shell companies

The benchmark Sensex plunged nearly 300 points at the pre-close trade as an unexpected regulatory order imposing trading restrictions on 162 listed entities identified as shell companies raised concerns about a wider probe into others.
Story first published: Tuesday, August 8, 2017, 16:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X