For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన ఐటీ రిట‌ర్నులు

గతేడాదితో పోలిస్తే దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య 25 శాతం మేర పెరిగిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 5 నాటికి 2.82 కోట్లు రిటర్నులు దాఖలయ్యాయని, అదే సమయంలో గతేడాది ఆ సంఖ్య 2.26కోట్లు మాత్రమే

|

ప్ర‌భుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు సానుకూల ఫ‌లితాలిచ్చేలా క‌నిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య 25 శాతం మేర పెరిగిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 5 నాటికి 2.82 కోట్లు రిటర్నులు దాఖలయ్యాయని, అదే సమయంలో గతేడాది ఆ సంఖ్య 2.26కోట్లు మాత్రమేనని కేంద్రం పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆగస్టు 5ను రిటర్నుల దాఖలుకు చివరి తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ఐటీ రిట‌ర్నుల దాఖ‌లు నోట్ల ర‌ద్దు వ‌ల్లే పెరిగిందా!

'పెద్దనోట్ల మార్పిడి, ఆపరేషన్‌ క్లీన్‌మనీ ప్రభావంతో ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆగస్టు 5 నాటికి 2,82,92,955 రిటర్నులు దాఖలయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 2,26,97,843 గా ఉంది. రిటర్నులు దాఖలు చేయ‌డంలో గతేడాది 9.9 శాతం పెరుగుదల కనిపించగా.. ఈ సారి 24.7 శాతం పెరుగుదుల కనిపించింది' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో పాటు వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపు దారుల సంఖ్య కూడా 25.3 శాతం పెరిగిందని తెలిపింది. ఈ ఏడాది 2.79 కోట్లు రిటర్నులు అందాయని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత పన్ను పరిధిలోకి కొత్తగా వచ్చార‌న‌డానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Read more about: notes ban it returns taxes
English summary

పెరిగిన ఐటీ రిట‌ర్నులు | Income Tax Return Filings Grow 25 percent this time

: The number of Income Tax Returns (ITRs) filed for 2016-17 year grew by 25 per cent to 2.82 crore, as increased number of individuals filed their tax returns post demonetisation, the tax department said today. The growth in ITRs filed by individuals is 25.3 per cent with over 2.79 crore returns having been received up to August 5 as against over 2.22 crore returns filed in the corresponding period last fiscal.
Story first published: Tuesday, August 8, 2017, 14:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X