For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా టైర్ల‌పై యాంటీ డంపింగ్ సుంకం

ఒక ప‌క్క డొక్లాం విష‌యం మీద రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో చైనాకు మింగుడుప‌డ‌ని నిర్ణ‌యాన్ని భారత ప్ర‌భుత్వం తీసుకుంది. చైనా నుంచి చౌక దిగుమ‌తుల‌ను అడ్డుకుని దేశీయా వ్యాపార

|

ఒక ప‌క్క డొక్లాం విష‌యం మీద రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో చైనాకు మింగుడుప‌డ‌ని నిర్ణ‌యాన్ని భారత ప్ర‌భుత్వం తీసుకుంది. చైనా నుంచి చౌక దిగుమ‌తుల‌ను అడ్డుకుని దేశీయా వ్యాపారాన్ని కాపాడేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం చైనా నుంచి దిగుమ‌త‌య్యే టైర్ల‌పై ట‌న్నుకు 452.33 డాల‌ర్ల సుంకం విధించ‌నున్నారు. చైనా నుంచి భారీగా దిగుమ‌త‌య్యే టైర్ల‌తో పోటీని త‌ట్టుకోలేక దేశీయ సంస్థ‌లు ఇబ్బందులు ప‌డుతున్నాయి. ఈ విష‌యం వాణిజ్య శాఖ‌కు చెందిన ద‌ర్యాప్తు విభాగం డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ యాంటీ-డంపింగ్ అండ్ అల్లీడ్ డ్యూటీస్‌(డీజీఏడీ) అధ్య‌యనంలో వెల్ల‌డైంది.

 చైనా టైర్ల‌పై దిగుమ‌తి నిరోధ‌క సుంకం

అంతే కాకుండా అపోలో టైర్స్‌, జేకే టైర్ ఇండస్ట్రీస్‌, సియ‌ట్ లిమిటెడ్ త‌ర‌పున టైర్ల త‌యారీ సంఘం(ఆత్మా) కేంద్ర వాణిజ్య శాఖ‌కు ఒక ద‌ర్యాప్తును స‌మ‌ర్పించింది. బ‌స్సులు, లారీలు, ట్ర‌క్కుల్లో వాడే రేడియ‌ల్ టైర్లు, నామిన‌ల్ రిమ్‌తో వ‌చ్చే ర‌బ్బ‌ర్ టైర్లు కార‌ణంగా దేశీయ ఉత్ప‌త్తుల‌పై ప్ర‌భావం పడుతుంద‌నేది దీని సారాంశం. అంతే కాకుండా ఎంతో కొంత దిగుమ‌తి సుంకం విధిస్తే కానీ స‌మ‌స్య సద్దుమ‌ణ‌గ‌ద‌ని సూచించారు. వారు ఒక ట‌న్నుపై 277.53 డాల‌ర్ల నుంచి 452.33 డాల‌ర్ల వ‌ర‌కూ సుంకం వేయాల్సిందిగా ప్ర‌తిపాదించారు. అయితే డీజీఏడీ సూచించిన విధంగా ఆర్థిక శాఖ విధించే సుంకం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Read more about: china tyres dumping duty
English summary

చైనా టైర్ల‌పై యాంటీ డంపింగ్ సుంకం | Anti dumping on China tyres as suggested by DGAD

India may impose anti—dumping duty of up to USD 452.33 per tonne on a certain variety of Chinese pneumatic radial tyres to guard domestic players from cheap imports.
Story first published: Tuesday, August 8, 2017, 10:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X