For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎమ్‌ల విస్త‌ర‌ణ స‌రిగా పెర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?

ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందన్న‌ట్లు, నోట్ల ర‌ద్దు పుణ్య‌మా అని ఏటీఎమ్‌ల సంఖ్య త‌గ్గ‌డానికి కార‌ణం అవుతోంది. అదేంటి దానికి దీనికి ఏంటీ సంబంధం అనుకుంటున్నారా? అవునండి సంబంధం ఉంది. ఎలా అంటారా? గ‌తే

|

ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందన్న‌ట్లు, నోట్ల ర‌ద్దు పుణ్య‌మా అని ఏటీఎమ్‌ల సంఖ్య త‌గ్గ‌డానికి కార‌ణం అవుతోంది. అదేంటి దానికి దీనికి ఏంటీ సంబంధం అనుకుంటున్నారా? అవునండి సంబంధం ఉంది. ఎలా అంటారా? గ‌తేడాది న‌వంబ‌రు 8వ తేదీ మోదీ తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం చాలా వాటిపై ప్ర‌భావం చూపింది అలానే ఏటీఎమ్ యంత్రాల ఏర్పాటుపై కూడా. బ్యాంకులు పెద్ద ఎత్తున న‌గ‌దు కొరత ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. దీని ప్ర‌భావం ఏటీఎమ్‌ల‌ విస్త‌ర‌ణపై ప‌డింద‌ని ప‌లు బ్యాంకుల సీనియ‌ర్ అధికారులు చెబుతున్నారు. దాని గురించి మ‌రిన్ని వివ‌రాలు కూలంక‌షంగా...

1. రెండు ర‌కాల ఏటీఎమ్‌లు

1. రెండు ర‌కాల ఏటీఎమ్‌లు

బ్యాంకుల‌కు రెండు ర‌కాల ఏటీఎమ్‌లు ఉంటాయి. ఒక‌టి బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో, మ‌రొక ర‌కం బ్యాంకుల బ‌య‌ట దూరంగా. బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో ఉండే వాటిని ఆన్‌సైట్ ఏటీఎమ్ అంటారు. ఇత‌ర ప్ర‌దేశంలో బ్యాంకుకు బ‌య‌ట ఉండే వాటిని ఆఫ్‌సైట్ ఏటీఎమ్ అంటారు.

2. సంఖ్య పెర‌గ‌లేదు

2. సంఖ్య పెర‌గ‌లేదు

నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌గ‌దు కొర‌త‌, డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ వంటి కార‌ణాల‌తో ఏటీఎంల‌ను విస్త‌రించేందుకు బ్యాంకులు మొగ్గుచూప‌లేదు. ముఖ్యంగా ఆన్‌సైట్ ఏటీఎమ్ యంత్రాల‌తో పోలిస్తే ఆఫ్‌సైట్ ఏటీఎమ్‌ల సంఖ్య బాగా త‌గ్గింది. ఆర్‌బీఐ గ‌ణాంకాలే ఏటీఎమ్ యంత్రాల సంఖ్య త‌గ్గిన‌ట్లు చెబుతున్నాయి. జూన్ 2017 నాటికి 98,092 ఆఫ్‌సైట్ ఏటీఎమ్‌లుండ‌గా గ‌తేడాది ఇదే స‌మ‌యానికి 99,989 ఉన్నాయి. ఉన్న ఏటీఎంల సంఖ్య పెర‌గక‌పోగా ఉన్న‌వాటిలో కొన్ని త‌గ్గిపోయాయి.

3. ఆన్‌సైట్ ఏటీఎమ్‌ల సంఖ్య‌

3. ఆన్‌సైట్ ఏటీఎమ్‌ల సంఖ్య‌

ఆన్‌సైట్ ఏటీఎమ్ అంటే బ్యాంకు శాఖ‌కు అనుసంధానించ‌బ‌డి బ్యాంకు ఆవ‌ర‌ణ‌లోనే ఉండేది. ఈ ఏటీఎమ్‌ల సంఖ్య జూన్-2014 నుంచి చూసిన‌ప్పుడు బాగానే పెరిగాయి. జూన్ 2014లో 87,925 నుంచి జూన్ 2015 నాటికి 92,200కు పెరిగాయి. మ‌ళ్లీ జూన్‌,2016 నాటికి 1,01,346 అయ్యాయి. జూన్,2017 నాటికి సైతం 1,10,385 కు పెర‌గ‌డం గ‌మ‌నార్హం.

4. ఆఫ్‌సైట్ ఏటీఎమ్‌ల సంఖ్య‌

4. ఆఫ్‌సైట్ ఏటీఎమ్‌ల సంఖ్య‌

కొన్ని బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు బ్యాంకుకు వెళ్లకుండానే చేయవ‌చ్చు. అందుకోసం బ్యాంకులు ఏటీఎమ్‌ల‌ను బ్యాంకులకు దూరంగా సైతం ఏర్పాటు చేస్తాయి. వీటిని ఆఫ్‌సైట్ ఏటీఎమ్ అని వ్య‌వ‌హరిస్తారు. వీటి సంఖ్య‌ జూన్ 2014లో 78,969; జూన్ 2015లో 93,284; జూన్‌,2016 నాటికి 99,989కి పెరుగుకుంటూ వ‌చ్చింది. అయితే గ‌తేడాది జూన్ నెల‌తో పోలిస్తే జూన్‌,2017 నాటికి 98,092కు త‌గ్గింది. మామూలుగా ప్ర‌జ‌ల‌కు వీటి అవ‌స‌ర‌మే ఎక్కువ పెరిగింది. అయితే ఇవి పెర‌గ‌క‌పోగా త‌గ్గాయి.

5. పెరిగిన‌వి, త‌గ్గిన‌వి

5. పెరిగిన‌వి, త‌గ్గిన‌వి

జూన్ 2014తో పోలిస్తే జూన్‌,2015 నాటికి మొత్తం ఏటీఎమ్‌ల సంఖ్య 18,590 వ‌ర‌కూ పెరిగింది. అదే జూన్‌,2015తో పోలిస్తే జూన్, 2016 నాటికి పెరిగిన మొత్తం ఏటీఎమ్‌ల సంఖ్య 15,851. ఇవి ప‌ర్వాలేద‌నిపించినా జూన్, 2016తో పోలిస్తే జూన్‌,2017 నాటికి ఏటీఎమ్‌ల సంఖ్య 7142 వ‌ర‌కూ పెరిగింది. జ‌న్‌ధ‌న్ యోజ‌న‌, డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ అని చెప్పుకుంటున్నా ఏటీఎంల ఏర్పాటులోనే నిర్ల‌క్ష్యం జ‌రుగుతోంది.

6. బ్యాంకుల వారీగా

6. బ్యాంకుల వారీగా

మ‌న దేశంలో మూడు పెద్ద బ్యాంకులు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ. దేశంలో అతి ఎక్కువ ఏటీఎమ్‌ల‌ను క‌లిగింది ఎస్‌బీఐ మాత్ర‌మే. ఆన్‌సైట్‌, ఆఫ్‌సైట్ ఏ ర‌కం ఏటీఎమ్‌ల ఏర్పాటులోనైనా ఎస్‌బీఐదే ఆధిప‌త్యం. ఎస్‌బీఐ ఏటీఎమ్‌ల సంఖ్య జూన్, 2016 నాటికి 49,821గా ఉండ‌గా మ‌ళ్లీ జూన్,2017 వ‌చ్చేస‌రికి 59,291కు పెరిగింది.

అదే హెచ్‌డీఎఫ్‌సీ విష‌యానికి వ‌స్తే జూన్, 2016లో 12,013గా ఉండ‌గా జూన్,2017 నాటికి 12,220.

ఐసీఐసీఐ బ్యాంకుకు జూన్, 2016లో 14,073గా ఉండ‌గా జూన్,2017 నాటికి 13,780కి త‌గ్గాయి.

7. ఎందుకు ఇలా...

7. ఎందుకు ఇలా...

డిజిట‌ల్ లావాదేవీలు పెంచాల‌నేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ఇందులో భాగంగా న‌గ‌దు వాడ‌కూడ‌దు కాబ‌ట్టి ఈ ప్ర‌భావం బ్యాంకుల‌పై ఉంది. దీంతో బ్యాంకులు ఏటీఎంల‌ను నెల‌కొల్ప‌డంలో నెమ్మ‌దిత‌నం ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. ఒక ప‌క్క బ్యాంకులు ఇత‌ర బ్యాంకుల ఏటీఎమ్‌ల విత్‌డ్రాయ‌ల్స్‌కు రుసుములు వ‌సూలు చేస్తున్న నేప‌థ్యంలో ఇది ఏ మాత్రం స‌రికాద‌ని ఖాతాదారులు వాపోతున్నారు.

Read more about: atm banking
English summary

ఏటీఎమ్‌ల విస్త‌ర‌ణ స‌రిగా పెర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి? | atm expansion slowdown due to Note Ban

A combination of factors, including cash crunch following demonetisation of high value notes announced in November last, have led to commercial banks cutting down on the number of automated teller machines (ATMs) particularly those not located in branches (off-site ATMs), latest RBI data showed.
Story first published: Monday, August 7, 2017, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X