ఆంధ్రా బ్యాంకు క్యూ1 ఫలితాలు: 14% లాభం పెరిగింది, రూ.40 కోట్ల నికర లాభం
ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో వసూలు కాని రుణాలు(మొండి బకాయిలు) పెరిగినా మెరుగైన ఫలితాలు ప్రకటించింది. గత సంవత్సరం క్యూ1లో 30
* త్రైమాసిక ఫలితాల్లో మురిపించిన ఆంధ్రా బ్యాంకు
ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో వసూలు కాని రుణాలు(మొండి బకాయిలు) పెరిగినా మెరుగైన ఫలితాలు ప్రకటించింది. గత సంవత్సరం క్యూ1 కంటే 30.07 శాతం వృద్ధితో రూ.40.42 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.31.09 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. ఈసారి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.5,155.21 కోట్లకు చేరింది. 2016 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.4,855.50 కోట్ల ఆదాయం ఆర్జించింది. నిర్వాహణ లాభాలు 37 శాతం వృద్ధితో రూ.1,000 కోట్లుగా నమోదు. 2017 జూన్ ముగింపు నాటికి ఆంధ్రా బ్యాంకు మొత్తం శాఖలు 2908, ఎటిఎం కేంద్రాలు 3929కి విస్తరించింది.

క్రితం జూన్ ముగింపు నాటికి బ్యాంకు స్థూల మొండి బకాయిలు ఏకంగా 13.22 శాతానికి ఎగిసి రూ.19,428 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికం నాటికి జిఎన్‌పిఎ 10.30 శాతంతో రూ.14,137 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం క్యూలో బ్యాంకు నికర నిరర్ధక ఆస్తులు 8.09 శాతానికి పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో రూ.6.21 శాతంగా నమోదయ్యాయి. క్రితం క్యూ1లో మొండి బకాయిలుల కోసం ఏకంగా రూ.1,301.11 కోట్ల కేటాయింపులు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.943.77 కోట్ల కేటాయింపులు జరిగాయి. శుక్రవారం ఎన్ఎస్ఈలో ఆంధ్రా బ్యాంకు షేర్ 1.55 శాతం పెరిగి రూ.55.80 వద్ద ముగిసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications