రైల్వే టిక్కెట్లకు ఆధార్ తప్పనిసరేం కాదు: ప‌్రభుత్వం
రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇచ్చిన దాని ప్రకారం రైల్వే టిక్కెట్ల బుకింగ్ ఆధార్ తప్పనిసరేం కాదు. రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహైన్ లిఖిత పూర్వక సమాధానం ప్రకారం ఇప్పటికి ఈ సమాచారం అందుబాటులో ఉ
రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇచ్చిన దాని ప్రకారం రైల్వే టిక్కెట్ల బుకింగ్ ఆధార్ తప్పనిసరేం కాదు. రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహైన్ లిఖిత పూర్వక సమాధానం ప్రకారం ఇప్పటికి ఈ సమాచారం అందుబాటులో ఉంది. 12 అంకెల ఆధార్‌ను రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు తప్పనిసరి చేసే ప్రణాళిక ఏదీ రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద లేదని సమాధానంలో వివరించారు. అదే విధంగా వివిధ వర్గాలకు ప్రభుత్వం కల్పించే రాయితీలకు సంబంధించి, రాయితీ టిక్కెట్లకు సైతం ఆధార్ తప్పనిసరి కాదని ఆయన పార్లమెంటుకు తెలిపారు. జనవరి 1,2017 నుంచి సీనియర్ సిటిజన్లు స్వచ్చందగా రాయితీ కోసం ఆధార్ నంబరును సమర్పించే వీలుందని గొహైన్ రాసిన సమాధానంలో ఉంది.

మరణ ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరా!
ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మరణ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుకు కూడా ఆధార్ ఉండాలని ప్రకటించిన నేపథ్యంలో మంత్రి నుంచి లిఖిత పూర్వక సమాధానం వచ్చింది. మొదట వచ్చిన వార్తల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రం జారీకి ఆధార్ సంఖ్య ఉండాల్సిందే. అయితే శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ప్రకారం వ్యక్తి మరణం వివరాలను నమోదు చేయించేందుకు ఆధార్ తప్పనిసరి కాదని తెలుస్తోంది. హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం మరణించిన వ్యక్తికి ఆధార్ లేకపోతే ఆధార్ నంబరు లేదా ఆధార్ ఎన్‌రోల్మెంట్ ఐడీ లేదని మరణ ధ్రువీకరణ కోసం దరఖాస్తుచేసేవారు స్వయం ధ్రువీకరణను సమర్తిస్తే చాలు.


Click it and Unblock the Notifications