సెన్సెక్స్ 87 పాయింట్లు పైకి
ఈ రోజు మార్కెట్లు కాస్త సర్దుకున్నాయి. మిడ్ సెషన్ సమయానికి నష్టాలను పక్కనబెట్టి లాభాల దిశగా కదిలాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87.53 పాయింట్ల లాభంతో 32,325.41 వద్ద ముగియగ
ఈ రోజు మార్కెట్లు కాస్త సర్దుకున్నాయి. మిడ్ సెషన్ సమయానికి నష్టాలను పక్కనబెట్టి లాభాల దిశగా కదిలాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87.53 పాయింట్ల లాభంతో 32,325.41 వద్ద ముగియగా, మరో వైపు నిఫ్టీ 52.75 పాయింట్లు పుంజుకొని 10.066 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే కన్సూమర్ డ్యూరబుల్స్(4.21%), చమురు,సహజ వాయు(2.63%), లోహ రంగం(2.5%), పీఎస్‌యూ(2.45%) పైకి ఎగియగా, కేవలం హెల్త్ కేర్ రంగం మాత్రం 0.94% డౌన్ అయింది. బయోకాన్ పరిశ్రమలో కొన్ని నాణ్యతా పరమైన లోపాలను అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ బయటపెట్టడంతో హెల్త్ కేర్ స్టాక్‌లు ప్రభావితం అయ్యాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హీరో మోటోకార్ప్(3.11%), కోల్ ఇండియా(3.04%), టాటా స్టీల్(2.85%), ఎన్‌టీపీసీ(2.78%), హెచ్‌యూఎల్(1.91%) లాభపడగా, మరో వైపు డాక్టర్ రెడ్డీస్(3.76%), సన్ ఫార్మా(1.85%), రిలయన్స్(1.76%), భారతి ఎయిర్టెల్(0.78%), హెచ్‌డీఎఫ్‌సీ(0.27%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications