For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకింగ్ నియంత్ర‌ణ స‌వ‌ర‌ణ బిల్లును ఆమోదించిన లోక్‌స‌భ‌

నిర‌ర్థ‌క ఆస్తుల‌(ఎన్‌పీఏ) ప‌రిష్కారానికి ఆర్‌బీఐకి ప్ర‌త్యేక అధికారాలు క‌ట్ట‌బెట్టే బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. దిగువ స‌భ‌లో అరుణ్‌జైట్లీ దీన్ని ప్ర‌వేశ‌పెట్ట‌గా లోక్‌స‌భ‌లో సాధార‌ణ మెజారిటీతో

|

నిర‌ర్థ‌క ఆస్తుల‌(ఎన్‌పీఏ) ప‌రిష్కారానికి ఆర్‌బీఐకి ప్ర‌త్యేక అధికారాలు క‌ట్ట‌బెట్టే బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. దిగువ స‌భ‌లో అరుణ్‌జైట్లీ దీన్ని ప్ర‌వేశ‌పెట్ట‌గా లోక్‌స‌భ‌లో సాధార‌ణ మెజారిటీతో ఆమోదించారు. దీనికి అన్ని పార్టీల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది.

 బ్యాంకింగ్ నియంత్ర‌ణ బిల్లు

బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు గాను మే నెలలో ప్ర‌భుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. మొండిబకాయిలను రాబట్టేందుకు దివాలా చట్టం ప్రకారంగా చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించేగలిగేలా ఈ బిల్లు ద్వారా ఆర్బీఐకి విశేషాధికారాలు కట్టబెట్టారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు రూ.8 లక్షల కోట్ల స్థాయికి చేరుకున్నాయి. అందులో 25 శాతం ఎన్‌పీఏలకు కారణమైన 12 సంస్థలపై దివాలా కోడ్‌ను ప్రయోగించాలని ఆర్‌బీఐ ఇప్పటికే సంబంధిత బ్యాంకులను ఆదేశించింది. ఇటీవ‌లే ఆర్బీఐ, బ్యాంకుల ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ఎస్సార్ సంస్థ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించింది. మొండి బ‌కాయిల వ‌సూలుకు సంబంధించి హైకోర్టు ఇటీవ‌ల స్టే విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిర‌ర్ద‌క ఆస్తుల ప‌రిష్కారం వేగ‌వంతం అయ్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.

Read more about: regulation act rbi banks
English summary

బ్యాంకింగ్ నియంత్ర‌ణ స‌వ‌ర‌ణ బిల్లును ఆమోదించిన లోక్‌స‌భ‌ | Banking Regulation Bill passed in Lok Sabha

The Banking Regulation (Amendment) Bill, 2017, which was promulgated in May this year, was passed in the Lok Sabha on Thursday. Finance Minister Arun Jaitley had introduced the bill in the Lower House on Monday.
Story first published: Friday, August 4, 2017, 20:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X