అరశాతం ఆశ.. నెరవేరక... ఆవిరైపోయాయా
గత రెండు రోజుల రికార్డు స్థాయి లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపినా ఇన్వెస్టర్ల సెంటిమెంటు సానుకూలంగా కదల్లేదు.
గత రెండు రోజుల రికార్డు స్థాయి లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపినా ఇన్వెస్టర్ల సెంటిమెంటు సానుకూలంగా కదల్లేదు. ఉదయం ట్రేడింగ్ నుంచి ఊగిసలాడిన సూచీలు చివరకు ప్చ్ మనిపించాయి. సెన్సెక్స్ 98 కోల్పోయి 32476వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు క్షీణించి 10081 వద్ద స్థిరపడ్డాయి.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(0.88%), క్యాపిటల్ గూడ్స్(0.83%), ఎఫ్ఎంసీజీ(0.76%), లోహ రంగం(0.75%)నష్టపోయిన వాటిలో ముందున్నాయి. మరో వైపు వినియోగదారు వస్తువులు(1.12%), పవర్(0.11%) లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో ఎన్టీపీసీ(4.06%), హీరో మోటోకార్ప్(2.12%), అదానీ పోర్ట్స్(2.08%), లుపిన్(1.6%), రిలయన్స్(1.59%) ఉండగా, నష్టపోయిన వాటిలో సన్‌ఫార్మా(1.95%), డాక్టర్ రెడ్డీస్(1.93%), టాటా మోటార్స్(1.66%), కొటక్ బ్యాంక్(1.39%), టీసీఎస్(1.3%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications