లాభాలు పెరిగాయ్... అంచనాలు తప్పాయ్...
దేశంలో నాలుగో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అంచనాలను అందుకోలేకపోయింది. అంచనావేసిన దానికంటే తక్కువగానే లాభాలను రాబట్టింది.
దేశంలో నాలుగో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అంచనాలను అందుకోలేకపోయింది. అంచనావేసిన దానికంటే తక్కువగానే లాభాలను రాబట్టింది. బ్యాంకు బుధవారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 12.09 శాతం పెరిగి, రూ.343.40 కోట్లు నమోదైనట్టు తెలిసింది. విశ్లేషకులు మాత్రం పీఎన్‌బీ రూ.404 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని భావించారు. ఆశ్చర్యకరంగా బ్యాంకు మొండిబకాయిల కేటాయింపులు గతేడాది కంటే 19 శాతం మేర తగ్గాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.3165.67 కోట్లున్న మొండిబకాయిలు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.2559.71 కోట్లుగా నమోదయ్యాయి. స్థూలంగా మాత్రం మొండిబకాయిలు మార్చి క్వార్టర్‌లో 12.53 శాతముంటే, జూన్ క్వార్టర్‌కు వచ్చేసరికి 13.66 శాతానికి పెరిగాయి.

ఫలితాల ప్రకటన నేపథ్యంలో పీఎన్‌బీ షేర్లు 1.52 శాతం పైన ట్రేడవుతున్నాయి. రూ.159.95 మార్కు వద్ద ప్రారంభమైన ఈ షేర్లు రూ.162 వద్ద గరిష్ట స్థాయిని, రూ.157.80 వద్ద కనిష్ట స్థాయిని తాకాయి. ఓ వైపు స్టాక్‌మార్కెట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 4.22 శాతం పైకి ఎగిసి, రూ.3855.13 కోట్ల వద్ద నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ ఆదాయం రూ.3,698.97 కోట్లగా ఉంది. కాగ, నికర ఎన్‌పీఏలు బ్యాంకువి అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 8.67 శాతం పెరిగాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications