ఇప్పటికైతే నిరుద్యోగ భృతి లభించిన దాఖాలాలే లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయమై మరోసారి అన్నింటినీ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగిత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 34 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కతేల్చింది. ఉపాథి కల్పనా కార్యాలయాల ద్వారా నమోదైన వారు కేవలం 8.80 లక్షల మంది వరకు ఉరడగా, తాజాగా ఇతర సర్వేల్లో తేలిన అరకెల మేరకు 34 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.2వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ మేరకు హామీ నెరవేర్చలేదు. దీనిపై వైకాపా అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏది ఏమైనా ఇప్పటికైతే నిరుద్యోగ భృతి లభించిన దాఖాలాలే లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయమై మరోసారి అన్నింటినీ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగిత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

34 లక్షల మంది నిరుద్యోగులు
ఇటీవల నిర్వహిరచిన ప్రజా సాధికారత సర్వేలో 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు 34 లక్షల వరకు ఉన్నట్లు తేలింది. 35 ఏళ్లకు మించిన వారు మరో పాతిక వేల మంది వరకు ఉన్నారని గుర్తించారు. నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు ఇటీవల సిద్ధం చేసిన గణాంకాల్లో సుమారు తొమ్మిది లక్షల మందే నిరుద్యోగులున్నట్లు ప్రకటించారు.

ప్రజా సాధికారత సర్వే ద్వారా
వాస్తవానికి భారీ సంఖ్యలో ఏ పని లేని వారున్నట్లు స్పష్టమవుతోరది. అందుకే ఇటీవల చేసిన ప్రజాసాధికారత సర్వే గణాంకాల్ని వెలికి తీసి, వాటిల్లో ఉన్న నిరుద్యోగుల వివరాల్ని క్రోడీకరించగా, దాదాపు 34 లక్షల మంది ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలురటాయని భావిస్తున్నారు. సర్వే లెక్కల మేరకు ఉన్న 34 లక్షల మంది నిరుద్యోగుల్లో అట్టడుగు వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.

వర్గాల వారీగా...
ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన వారు 24 లక్షల మంది ఉరడగా, ఇతర కులాలకు చెరదిన వారు 10 లక్షల మంది వరకు ఉన్నట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి.

ఏ వయసులో నిరుద్యోగిత ఎలా?
అలాగే ఇంటర్, డిగ్రీ చదివిన వారే ఎక్కువ నిరుద్యోగులుగా కనిపిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే 35 ఏళ్ల లోపు వయసున్న నిరుద్యోగులు 34 లక్షల మంది, 35 నుంచి 40 మధ్య వయసున్న వారు 13 వేల మంది, 40 నురచి 45 మధ్య ఉన్న వారు 10 వేల మంది, అంతకన్నా ఎక్కువ వయసున్న నిరుద్యోగులు 17 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు.

16 లక్షల మంది బీసీ నిరుద్యోగులు
మొత్తం నిరుద్యోగుల వివరాల్ని పరిశీలిస్తే 35 ఏళ్లలోపు ఉన్న వారిలో అత్యధికంగా బిసి నిరుద్యోగులు 16 లక్షల వరకు ఉరడగా, ఎస్సీలు 6 లక్షల మంది, గిరిజనులు 1.40 లక్షల మంది ఉన్నారు.

12 లక్షల మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు
విద్యార్హతల వారీగా చూస్తే అత్యధికంగా 12 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇంటర్ చదివిన వారు 10.45 లక్షల మంది ఉండగా, పదో తరగతి అర్హత కలిగిన వారు 6.25 లక్షల మంది, పాలిటెక్నిక్, ఐటిఐ వంటి సాంకేతిక అర్హతలు కలిగిన వారు 2.89 లక్షల మంది, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర అర్హతలు కలిగిన వారు మరో 2.07 లక్షల మంది ఉన్నట్లు సర్వేలో తేలింది.

7. నిరుద్యోగిత ఎందుకు పెరుగుతోంది?
ఇంటర్ వరకు చదివి మానేసిన 10.45 లక్షల నిరుద్యోగుల్లో కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే అధికంగా కనిపిస్తున్నారు. వారిలో బిసిలు 5.08 లక్షలు, ఎస్సీలు 2.06 లక్షలు, ఎస్టీలు 51 వేల మంది ఉన్నారు. వీరంతా చాలాకాలంగా ఉద్యోగాలు లేక సతమతమవుతున్న వారే కావడం విశేషం. నేరుగా ఉద్యోగాలు లేకపోయినా, కనీసం స్వయం ఉపాథి కార్యక్రమాలు కూడా దరి చేరకపోవడం వల్ల నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications