For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డు గ‌రిష్టాల‌కు మార్కెట్లు

సోమ‌వారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఈ రోజు సైతం రికార్డు గ‌రిష్టాల్లోనే ముగిశాయి. అంత‌ర్జాతీయ సానుకూల ప‌రిణామాల‌తో పాటు, దేశంలో రిజ‌ర్వ్ బ్యాంక్ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తుంద‌న్న సంకేతాలు ఊపందుకోవ‌డంత

|

సోమ‌వారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఈ రోజు సైతం రికార్డు గ‌రిష్టాల్లోనే ముగిశాయి. అంత‌ర్జాతీయ సానుకూల ప‌రిణామాల‌తో పాటు, దేశంలో రిజ‌ర్వ్ బ్యాంక్ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తుంద‌న్న సంకేతాలు ఊపందుకోవ‌డంతో మార్కెట్లు సానుకూలంగా సాగాయి. దీంతో రెండు సూచీలు రికార్డు గ‌రిష్టాల‌కు వెళ్లాయి. సెన్సెక్స్ 60.23(0.19%) పాయింట్లు లాభ‌ప‌డి 32,575.17 వ‌ద్ద ముగియ‌గా, జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 37.55 పాయింట్లు(0.37%) లాభ‌ప‌డి 10,114.65 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 రికార్డు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే వాహ‌న రంగం(1.57%), లోహ రంగం(1.02%), మౌలిక రంగం(0.48%), చ‌మురు,స‌హ‌జ వాయు రంగం(0.36%)ఈ రోజు ట్రేడింగ్‌లో లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు వినియోగ‌దారు వ‌స్తు రంగం(0.75%), మూల‌ధ‌న వ‌స్తు రంగం(0.37%), ప‌వ‌ర్‌(0.08%), పీఎస్‌యూ(0.07%) న‌ష్ట‌పోయాయి.
సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో హీరో మోటోకార్ప్(2.05%), మారుతి(1.96%), విప్రో(1.82%), ఎమ్& ఎమ్ (1.77%), హెచ్‌యూఎల్(1.73%) ఉండ‌గా, మ‌రో వైపు లుపిన్‌(1.36%), ఓఎన్‌జీసీ(1.21%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1.2%), ఏసియ‌న్ పెయింట్స్‌(0.98%), కొట‌క్ బ్యాంక్‌(0.67%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

రికార్డు గ‌రిష్టాల‌కు మార్కెట్లు | sensex ends at record high

The Sensex and Nifty closed at their highest ever level for a second session in a row as automakers such as Eicher Motors Ltd advanced on upbeat monthly sales a day ahead of a key central bank policy meeting.
Story first published: Tuesday, August 1, 2017, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X