205 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఒక పక్క ఆర్‌బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపుతుందున్న అంచనాలు, మరో వైపు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 0.50% మేర తగ్గించిన నేపథ్యంలో మార్కెట్లకు జోష్ వచ్చింది.
ఒక పక్క ఆర్‌బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపుతుందున్న అంచనాలు, మరో వైపు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 0.50% మేర తగ్గించిన నేపథ్యంలో మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో దేశీయ మార్కట్లు ట్రేడింగ్ ముగిసే సరికి లాభాల్లో నిలిచాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 205.06(0.63%) పాయింట్లు లాభపడి 32,514.94 వద్ద ముగియగా; మరో సూచీ నిఫ్టీ 62.6 పాయింట్లు పుంజుకుని 10,077 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి ఇది రికార్డు ముగింపు.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే కన్సూమర్ డ్యూరబుల్స్(1.86%), లోహ రంగం(1.69%), పీఎస్‌యూ(1.66%), క్యాపిటల్ గూడ్స్(1.4%) లాభపడగా; మరో వైపు హెల్త్ కేర్(1.52%), ఎఫ్ఎంసీజీ(0.99%) నష్టపోయాయి.
సెన్సెక్స్ గెయినర్లలో లాభపడిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(4.46%), పవర్ గ్రిడ్(4.23%), టాటా స్టీల్(2.89%), ఎల్ అండ్ టీ(2.85%), ఓఎన్‌జీసీ(2.82%) ముందుండగా; మరో వైపు నష్టపోయిన వాటిలో సన్ ఫార్మా(3.47%), డాక్టర్ రెడ్డీస్(3.11%), లుపిన్(2.9%), ఐటీసీ(2.09%), ఐటీసీ(2.09%), సిప్లా(1.18%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications