సహారా బీమా వ్యాపారాన్ని ఐసీఐసీఐ సంస్థకు అప్పగించడంపై కోర్టుకు
సహారా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని టేకోవర్ చేసుకోవాలంటూ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డిఎఐ ఆదేశించడాన్ని సహారా గ్రూప్ సవాల్ చేయనుంది. కోర్టుకు వెళ్లేందుకు సహారా సిద్ధమైం
సహారా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని టేకోవర్ చేసుకోవాలంటూ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డిఎఐ ఆదేశించడాన్ని సహారా గ్రూప్ సవాల్ చేయనుంది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆదివారం సుబ్రతా రాయ్ నేతృత్వంలోని సహారా గ్రూప్ స్పష్టం చేసింది. ఐఆర్డిఎఐ నిర్ణయం దురదృష్టకరమని సదరు సంస్థ పేర్కొంది.

బీమా రంగ నిబంధనల ప్రకారం సహారా లైఫ్ నడవడం లేదని, దాని నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో సహారా గ్రూప్ చూసుకోలేదన్న అభిప్రాయానికి వచ్చిన ఐఆర్డిఎఐ.. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ద్వారా వాల్యుయేషన్ రిపోర్టును తెప్పించుకుంది. ఈ క్రమంలోనే సహారా లైఫ్‌ను ఐసిఐసిఐకి అప్పగించాలని భావించగా, దీనిపై ఐఆర్డిఎఐ చైర్మన్‌ను సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కలిశారు కూడా. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు కోర్టుకు వెళ్లేందుకు సహారా సిద్ధమైంది. మరో ప్రైవేట్ రంగ బీమా సంస్థకు తమ సంస్థను అప్పగించడం సరికాదని మండిపడింది.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications