మార్కెట్లు ముగిసే సమయానికి పెద్దగా మార్పేమీ లేదు...
బీఎస్ఈ సెన్సెక్స్ 0.84 పాయింట్లు లాభపడి 32,383.30 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 0.1 పాయింట్లు క్షీణించి 10,020.55 వద్ద స్థిరపడింది.
ఉదయం మామూలుగా మొదలైన మార్కెట్లు ఇంట్రా డే గరిష్టాలకు వెళ్లాయి. జులై నెలకు సంబంధించి ఫ్యూచర్ కాంట్రాక్టుల ముగింపుతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించడంతో ఇలా జరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 0.84 పాయింట్లు లాభపడి 32,383.30 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 0.1 పాయింట్లు క్షీణించి 10,020.55 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(1.79%), టెక్నాలజీ(1.68%), హెల్త్ కేర్(1.32%),లోహ రంగం(0.87%) పడిపోయాయి. బ్యాంకింగ్ రంగం(0.83%), మూలధన వస్తువులు(0.35%), ఇన్‌ఫ్రా(0.31%), స్థిరాస్తి(0.04%) రాణించాయి.

సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ(5.55%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(2.07%), కొటక్ బ్యాంక్(0.99%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.78%) లాభపడగా, నష్టాల్లో నిలిచిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(4.08%), భారతీ ఎయిర్టెల్(3.09%), టాటా మోటార్స్(2.79%), టీసీఎస్(2.73%), ఇన్ఫోసిస్(2.59%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications