బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్త సమ్మె
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ఈ నెల 27న ఒక రోజు పాటు దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. జీతాలు పెంచనందుకు నిరసనగా ఆందోళనబాట పట్టనున్నారు.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ఈ నెల 27న ఒక రోజు పాటు దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. జీతాలు పెంచనందుకు నిరసనగా ఆందోళనబాట పట్టనున్నారు. సంస్థల పనితీరు ఆధారంగా జీతాలు పెంచాలని మూడో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసింది. దీని ప్రకారం వరుసగా మూడేళ్ల పాటు లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలకే జీతాలు పెంచే వెసులుబాటు ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆ అవకాశం లేకపోవడంతో సమ్మె చేయనున్నారు.

బీఎస్ఎన్ఎల్ నష్టాల్లోకి జారుకోవడానికి కారణం ఆ సంస్థ ఉద్యోగులు కాదని, బీఎస్ఎన్ఎల్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం రూపొందించిన విధానాలే అందకు కారణమని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల కన్వీనర్ అభిమన్యు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా 2006 నుంచి 2012 మధ్య మొబైల్ నెట్‌వర్క్ విస్తరణకు మంచి పరికరాలు కొనకుండా బీఎస్ఎన్ఎల్‌ను ప్రభుత్వమే ఆపిందని విమర్శించారు. 2013 నుంచి సంస్థ కొత్త పరికరాలను కొనడం మొదలుపెట్టి మార్పులు చేసిన తర్వాత కంపెనీ ఆర్థిక స్థితి మెరుగుపడిందన్నారు. బీఎస్ఎన్ఎల్ 2013-14లో రూ.691 కోట్ల నిర్వహణ నష్టాన్ని చవిచూడగా గత రెండేళ్లలో చాలా మార్పు వచ్చింది. 2014-15లో సంస్థ నిర్వహణ లాభం రూ.672 కోట్లుగా నమోదు కాగా, 2015-16 నాటికి రూ.3854 కోట్లకు చేరుకుంది.
రిలయన్స్ జియో నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ, బీఎస్ఎన్ఎల్ ప్రతి నెలా కనీసం 20 లక్షల మంది కొత్త వినియోగదారులను జత చేసుకోగలుగుతుంది. వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల్లో బీఎస్ఎన్ఎల్ కచ్చితంగా లాభాల బాట పడుతుందని ఉద్యోగ సంఘాల ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications