టెలికం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన తీవ్ర పోటీతో భారతీ ఎయిర్టెల్ లాభాలకు మరోమారు గండిపడింది. 2017 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎయిర్టెల్ నికర లాభాలు 75 శాతం పతనమై రూ.367 కోట్లకు ప
టెలికం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన తీవ్ర పోటీతో భారతీ ఎయిర్టెల్ లాభాలకు మరోమారు గండిపడింది. 2017 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎయిర్టెల్ నికర లాభాలు 75 శాతం పతనమై రూ.367 కోట్లకు పరిమితమయ్యాయి.

గతేడాది ఇదే క్యూ1లో ఏకంగా రూ.1,462 కోట్ల లాభాలు సాధించింది. క్రితం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.373 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 14 శాతం పతనమై రూ.25,546 కోట్ల నుంచి రూ.21,958 కోట్లకు క్షీణించింది. మొబైల్ డేటా రెవెన్యూ 16.8 శాతం పతనమై రూ.3,765 కోట్లుగా నమోదయ్యింది. దేశీయ రెవెన్యూలో 10 శాతం తగ్గి రూ.17,244 కోట్లుగా చోటు చేసుకుంది. కొత్త ఆపరేటర్ వల్ల క్రితం త్రైమాసికంలోనూ మొబైల్ మార్కెట్లో ఒత్తిళ్లు చోటు చేసుకున్నాయని భారతీ ఎయిర్టెల్ ఇండియా సిఇఒ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. మంగళవారం బిఎస్ఇలో భారతీ ఎయిర్టెల్ షేర్ 1.76 శాతం పెరిగి రూ.427.60 వద్ద ముగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications