10వేలకు దిగువనే నిఫ్టీ
మొట్టమొదటిసారి 10వేల మార్కును తాకిన నిఫ్టీ అమ్మకాల ఒత్తిడితో ఆ స్థాయి వద్ద నిలదొక్కుకోలేకపోయింది. నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 9965 వద్ద ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డు సృష్టించ
మొట్టమొదటిసారి 10వేల మార్కును తాకిన నిఫ్టీ అమ్మకాల ఒత్తిడితో ఆ స్థాయి వద్ద నిలదొక్కుకోలేకపోయింది. నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 9965 వద్ద ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఓపెనింగ్ ట్రేడింగ్లో దూసుకెళ్లిన బాంబే సెన్సెక్స్ 18 పాయింట్లు నష్టపోయి 32,228 వద్ద స్థిరపిడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాలు నష్టపోయాయి. స్థిరాస్తి(0.63%), బ్యాంకింగ్(0.5%), టెక్నాలజీ(0.48%) లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో యాక్సిస్ బ్యాంక్(1.94%), భారతీ ఎయిర్టెల్(1.76%), టీసీఎస్(1.5%), టాటా స్టీల్(1.03%), అదానీ పోర్ట్స్(0.68%) ముందు వరుసలో ఉండగా, నష్టపోయిన వాటిలో లుపిన్(1.96%), టాటా మోటార్స్(1.61%), కోల్ ఇండియా(1.07%), సన్ ఫార్మా(0.81%), సిప్లా(0.8%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications