సీనియర్ సిటిజన్ల కోసం వయ వందన యోజన
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాన మంత్రి వయ వందన యోజన అనే పెన్షన్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇది కేవలం సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ఇ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాన మంత్రి వయ వందన యోజన అనే పెన్షన్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇది కేవలం సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ఇతర బీమా కంపెనీ కన్నా ఎల్ఐసీ క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో ఎక్కువని జైట్లీ అన్నారు. ఎల్ఐసీ ఈ పథకం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా 58,152 లబ్దిదారుల ద్వారా రూ. 2705 కోట్లను సేకరించారు. ఈ పథకం ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి వయ వందన యోజన: 10 ముఖ్య విషయాలు
1. మే 4, 2017న ప్రారంభించిన ఈ పథకం మే 3,2018 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి కలిగే అధిక వడ్డీ భారాన్ని కేంద్రం ఎల్ఐసీకి చెల్లిస్తుంది.
2. ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లోనూ లేదా కార్యాలయంలో దరఖాస్తు నింపి ఆఫ్‌లైన్లో ఈ పథకంలో చేరవచ్చు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఎల్ఐసీ మాత్రమే నిర్వహిస్తుంది.
3. ఈ పథకంలో వార్షిక వడ్డీ రాబడి కనీసం 8% వచ్చేలా చూస్తారు. నెలవారీ చెల్లింపే 8% వడ్డీ రూపంలో వచ్చేలా చేసే ఈ పథకంలో వార్షిక వడ్డీ దాదాపు 8.30% వచ్చే అవకాశం ఉంది.(10 ఏళ్ల పాటు)
4. పెన్షన్‌ను నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, ఏటా ఒకసారి చెల్లించే ఏర్పాటు ఉంది. పాలసీదారు ఇష్టాన్ని బట్టి కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
5. ఈ పథకంలో నెలకు కనీసం రూ.1000 పింఛను కావాలంటే రూ.1.5 లక్షలు, గరిష్టంగా రూ.5000 పింఛను కావాలంటే రూ.7,50,000 పెట్టుబడి పెట్టాలి.
6. పింఛనుదారు పాలసీ మొదలుపెట్టిన కాలం నుంచి చివరి వరకూ ఉంటే, 10 ఏళ్ల పాటు ఏటా పింఛను చెల్లిస్తూ కొనుగోలు విలువను సైతం వెనక్కు చెల్లిస్తారు.
7. గడువు లోపు పింఛనుదారు చనిపోతే పెట్టిన పెట్టుబడిని లబ్దిదారుల వారసులకు చెల్లిస్తారు. మధ్యలోనే పించనుదారు లేదా జీవిత భాగస్వామి తీవ్రమైన వ్యాధుల బారిన పడతే పెట్టిన పెట్టుబడిలో 98% తిరిగి చెల్లిస్తారు.
8. పాలసీ మొదలైన మూడేళ్ల కాలం నుంచి ఖర్చుల కోసం పాలసీ విలువలో 75% వరకూ
రుణం పొందవచ్చు. రుణ వడ్డీని పింఛను వాయిదాల నుంచి ఎల్ఐసీ రాబట్టుకుంటుంది. మిగిలిన రుణాన్ని క్లెయిం సొమ్ము నుంచి తీసుకుంటారు.
9. సీనియర్ సిటిజన్ పొదుపు పథకం లాగే ఇది ఒక మంచి పథకమని దీనిని 60 ఏళ్లు అంతకు మించి వయసు ఉన్నవారు ఉపయోగించుకోవాలని అవుట్‌లుక్ సీఈవో మనోజ్ నాగ్‌పాల్ చెప్పారు.
మధ్యలో ఎక్కువ డబ్బు అవసరం లేకుండా నెలవారీ పింఛను అందుకుంటే చాలనుకునే వయోవృద్దులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
10. అన్ని రకాల సేవా పన్నుల నుంచి ఈ పథకానికి మినహాయింపును ఇచ్చారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications