ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 4జి సేవలను వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, 1,150 వరకు 4జి సై
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 4జి సేవలను వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, 1,150 వరకు 4జి సైట్స్‌ను నెలకొల్పనున్నట్లు బిఎన్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజన్ ఎల్ అనంతరామ్ ప్రకటించారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే 4జీ సేవల నిర్మాణ పనులు చేపడతామన్నారు. కాగా, దేశం మొత్తం మీద 4జీ కోసం పదివేల సైట్లను ఎంపిక చేశారు. అందులో తెలంగాణకు 550 సైట్లు, ఆంధ్రాకు 600 సైట్లను కేటాయించారని ఆయన చెప్పారు. మరోవైపు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 4,27,209 సిమ్‌లు యాక్టివేట్ అయినట్లు చెప్పారు. ఇకపోతే రెండు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో రూ. 2,500 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ 4జీ ప్లస్ కింద వైఫై సర్వీసులు తెలంగాణలో ప్రారంభించామన్నారు. మొదటి దశలో 63 లొకేషన్లలో వైఫై సేవలు ప్రారంభించారు. ఇందులో 11 రూరల్ ఎక్స్ఛేంజీలు ఉన్నాయన్నారు. వచ్చే నెలాఖరు నాటికి మరో 58 ప్రదేశాల్లో ఇటువంటివి ప్రారంభిస్తామన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఐఐటిలో ర్యాంకు వచ్చిన కార్తీక్, ఎమ్సెట్‌లో ర్యాంకు సాధించిన సాయిసుమంత్‌లకు సిమ్ కార్డులను అందజేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications