ఇప్పుడు రుణాలు అందుకోవడం ఎంత తొందరైతే అంత బాగా రుణ పుస్తక విలువను(లోన్ బుక్) బ్యాంకు పెంచుకోవచ్చు. అందుకోసమే బ్యాంకులు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. అదే దిశలో ప్రయివేటు బ్యాంకులు సరికొత్
ఇప్పుడు రుణాలు అందుకోవడం ఎంత తొందరైతే అంత బాగా రుణ పుస్తక విలువను(లోన్ బుక్) బ్యాంకు పెంచుకోవచ్చు. అందుకోసమే బ్యాంకులు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. అదే దిశలో ప్రయివేటు బ్యాంకులు సరికొత్తగా ఆలోచిస్తుంటాయి. అదే కోవలో ఐసీఐసీఐ బ్యాంకు వినూత్నంగా ఏటీఎం ద్వారా తక్షణమే రుణాలు అందించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది ఎంపిక చేసిన తమ ఖాతాదారులకు మాత్రమేనని షరతు విధించింది. తమ బ్యాంకులో వేతన ఖాతాలు కలిగిన వారు తక్షణమే రూ.15 లక్షల వరకు రుణం పొందవచ్చని గురువారం ఆ బ్యాంకు పేర్కొంది.

లావాదేవీలను నగదురహిత, డిజిటల్‌గా మార్చడానికి ఈ తరహా సేవను అందుబాటులోకి తెచ్చామని తెలిపింది. తక్షణమే ఖాతాదారులు వ్యక్తిగత రుణాలను పొందడానికి ఏటీఎంల ద్వారా రుణాలు అందించే సౌకర్యాన్ని తీసుకొచ్చామని ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి పేర్కొన్నారు. తొలుత ఖాతాదారులకు తమకు అవసరమయ్యే ముందస్తు అనుమతి రుణ ఆఫర్‌ను ఎంచుకోవాలి. వారి అర్హతను బట్టి ఎటిఎం రుణ మొత్తాలను చూపిస్తుంది. రుణ విలువతో పాటు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజును, ఈఎంఐ మొత్తం తదితర నిబంధ నలను ఖాతాదారులు అంగీకరించాలి. ఈ ప్రక్రియ తర్వాత ఖాతాదారుల ఖాతాలో ఆ రుణ మొత్తాన్ని బ్యాంకు జమ చేస్తుంది. ఐదేళ్ల ఫిక్స్‌డ్ కాలవ్యవధిలో కస్టమర్లు రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పొందడానికి వీలుందని వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications