For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డు గ‌రిష్టం నుంచి న‌ష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్‌ 32,000 పాయింట్లు, నిఫ్టీ 9,850 స్థాయి దిగువకు చేరాయి. డిసెంబ‌ర్ 2 త‌ర్వాత ఒక్క రోజులో సెన్సెక్స్ ఇంత శాతం ప‌డిపోవ‌డం మ‌ళ్లీ ఈ రోజే. నిప్టీ సూచీకి మే 18 త‌ర్వాత ఈ స్థాయి ప‌త‌నం ఈ రోజే.

|

* 360 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్‌
మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు న‌ష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు జారి 31,711ను తాకగా.. నిఫ్టీ 89 పాయింట్లు పడి 9827 వ‌ద్ద స్థిర‌పడింది. దీంతో సెన్సెక్స్‌ 32,000 పాయింట్లు, నిఫ్టీ 9,850 స్థాయి దిగువకు చేరాయి. డిసెంబ‌ర్ 2 త‌ర్వాత ఒక్క రోజులో సెన్సెక్స్ ఇంత శాతం ప‌డిపోవ‌డం మ‌ళ్లీ ఈ రోజే. నిప్టీ సూచీకి మే 18 త‌ర్వాత ఈ స్థాయి ప‌త‌నం ఈ రోజే.

న‌ష్ట‌పోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఐటీసీ షేర్ ధ‌ర 12.5% ప‌డిపోయింది. ఉదయం ప్రారంభ ట్రేడింగ్లో 11.30 గం.ల స‌మ‌యానికి ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ విలువ‌ను ఈ సంస్థ కోల్పోయింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(6.12%), స్థిరాస్తి(1.1%), చ‌మురు,స‌హ‌జ వాయు(0.79%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.66%) న‌ష్ట‌పోగా, మ‌రో వైపు ఐటీ(0.24%), ఆటో(0.2%), హెల్త్ కేర్(0.18%), టెక్(0.32%) రంగాలు లాభ‌ప‌డ్డాయి.
సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో ఏసియ‌న్ పెయింట్స్‌(1.82%), స‌న్ ఫార్మా(1.18%), యాక్సిస్ బ్యాంకు(1.18%), ఓఎన్జీసీ(1.06%), హీరో మోటోకార్ప్‌(0.83%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో ఐటీసీ(12.63%), రిల‌య‌న్స్(2.03%), స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(0.8%), ఎన్టీపీసీ(0.65%), ప‌వ‌ర్ గ్రిడ్‌(0.55%) ఉన్నాయి.

English summary

రికార్డు గ‌రిష్టం నుంచి న‌ష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు | Sensex posts biggest fall in the year 2017

The benchmark BSE Sensex plunged 1.13 per cent, posting its biggest daily percentage drop this year and retreating from a record high in the previous session, as ITC Ltd slumped on hike in cigarette cess.The Goods and Services Tax (GST) Council had on Monday increased the cess on cigarettes to correct a duty anomaly that was yielding windfall profits to tobacco companies.
Story first published: Tuesday, July 18, 2017, 17:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X