పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీల పెంపుపై దృష్టి సారించాయి. అయితే ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో డిజిటల్ లావాదేవీల్లో పురోగతి లేదనే చెప్పాలి. మొత్తం డిజిట
పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీల పెంపుపై దృష్టి సారించాయి. అయితే ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో డిజిటల్ లావాదేవీల్లో పురోగతి లేదనే చెప్పాలి. మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 23% పురోగతి కనబడుతుండగా కార్డు ఆధారిత లావాదేవీల్లో కేవలం 7% మాత్రమే పెరుగుదల ఉన్నట్లు పార్లమెంటరీ స్థాయి సంఘానికి అధికారులు వివరించారు. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు నోట్ల రద్దు, డిజిటల్ ఆర్థిక వ్యవహారాల దిశగా సన్నద్దత వంటి అంశాలపై దృష్టి సారించింది. వివిధ మంత్రిత్వ శాఖల నుంచి హాజరైన అధికారుల బృందం డిజిటల్ లావాదేవీల పురోగతిని గురించి వారికి వివరించింది. నవంబరు, 2016 లో ఉన్న డిజిటల్ లావాదేవీల సంఖ్య 22.4 మిలియన్ రూపాయల నుంచి 23% వృద్దితో మే 2017 నాటికి 27.5 మిలియన్ రూపయాలకు పెరిగింది. ఇందులో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే ఎక్కువ వృద్ది సాధించినట్లు తెలుస్తోంది. నవంబరు 2016లో ఒక రోజుకు మిలియన్ యూపీఐ ఆధారిత లావాదేవీలు జరుగుతుండగా మే,2017 నాటికి రోజుకు 30 మిలియన్ లావాదేవీలు జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల్లో ఉండే యూపీఐ ద్వారా మరో వ్యక్తి బ్యాంకు ఖాతాను మీ లబ్దిదారుల జాబితాలో జమ చేసుకోకుండానే నేరుగా నగదు బదిలీ చేయవచ్చు. దాదాపు 7 నెలల కాలవ్యవధిలో ఐఎంపీఎస్ ఆధారిత చెల్లింపులు 1.2 మిలియన్ స్థాయి నుంచి 2.2 మిలియన్లకు పెరిగాయని తెలుస్తోంది. ఇక అతి తక్కువగా డిజిటల్ లావాదేవీలు జరిగిన విభాగం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానేనని అధికారులు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో 6.8మిలియన్ల మంది కార్డులను వినియోగించగా, ఈ ఏడాది మే నాటికి ఆ సంఖ్య 7.3 మిలియన్లుగా మాత్రమే ఉంది. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications