రూ.64 వేల కోట్లను దాటిన జన్‌ధన్ డిపాజిట్లు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్ల సంఖ్య రికార్డు స్థాయి రూ.64, 564 కోట్లకు చేరాయి. ఇందులో పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) తర్వాతి ఏడు నెల్లలో జరిగిన డిపాజిట్ల సంఖ్య రూ.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్ల సంఖ్య రికార్డు స్థాయి రూ.64, 564 కోట్లకు చేరాయి. ఇందులో పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) తర్వాతి ఏడు నెల్లలో జరిగిన డిపాజిట్ల సంఖ్య రూ.300 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై). బ్యాంకింగ్ విషయంలో అందరికీ అవగాహన తెచ్చేందుకు, ప్రభుత్వ పథకాల లబ్దిని నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఈ పథకాన్ని విస్తృతంగా ఉపయోగించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

ఆర్థిక శాఖకు పీటీఐ ప్రతినిధి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ప్రభుత్వ ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాల గురించిన సమాచారం ఇచ్చింది. జూన్ 14 వరకూ 28.9 కోట్ల జన్‌ధన్ యోజన ఖాతాల్లో ఉన్న సొమ్ము వివరాలను ఇచ్చారు. ఇందులో 23.27 కోట్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాలు, 4.7 కోట్ల గ్రామీణ బ్యాంకుల ఖాతాలు, 92.7 లక్షల ప్రయివేటు బ్యాంకుల ఖాతాలు ఉన్నాయి. ఈ అన్ని ఖాతాల్లోనూ ఇప్పటిదాకా ఉన్న సొమ్ము విలువ రూ.64,564 కోట్లుగా ఉంది. జన్‌ధన్ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 50,800 కోట్లు, గ్రామీణ బ్యాంకుల్లో రూ. 11,683.42 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 2080.62 కోట్లు డిపాజిట్లుగా ఉన్నాయి. గతేడాది నవంబరు 16 నుంచి మొదలుకొని ఈ ఏడాది జూన్ 14 మధ్య పీఎంజేడీవై ఖాతాల్లో జమైన సొమ్ము రూ.311.93 కోట్లుగా తేలింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications