టోకు ద్ర‌వ్యోల్బ‌ణం జూన్‌లో 0.9%

ఒక ప‌క్క వాస్త‌వంగా ధ‌ర‌లు పెరుగుతుంటే టోకు ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రో విధంగా ఉంది. మే నెల‌లో 2.17% గా ఉన్న టోకు వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌ జూన్ నెల‌లో మాత్రం ఈ సంవ‌త్స‌ర కనిష్ట స్థాయి 0.9 శాతానికి త‌గ్గింది

ఒక ప‌క్క వాస్త‌వంగా ధ‌ర‌లు పెరుగుతుంటే టోకు ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రో విధంగా ఉంది. మే నెల‌లో 2.17% గా ఉన్న టోకు వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌ జూన్ నెల‌లో మాత్రం ఈ సంవ‌త్స‌ర కనిష్ట స్థాయి 0.9 శాతానికి త‌గ్గింది. గతేడాది జూన్ నెల‌లో సైతం ఇది 0.9% వ‌ద్దే ఉండింది.

 బంగాళ‌దుంపలు బాగా త‌గ్గాయ్‌

మొత్తం ఆహార ప‌దార్థాల్లో బంగాళ‌దుంప‌లు, తృణ ధాన్యాలు, గోదుమ‌లు, కూర‌గాయ‌లు బాగా త‌గ్గాయి. ఇంధ‌నం, విద్యుత్, తయారీ రంగంలోని వ‌స్తువుల్లో ధ‌ర‌ల పెరుగుద‌ల సైతం సాంత్వ‌న ఇచ్చింది. ఇంధ‌నం, విద్యుత్ రంగాల్లో ధ‌రోల్బ‌ణం 5.28%కి త‌గ్గ‌డం విశేషం. మే నెల‌లో ఇది 11.69%గా న‌మోద‌యింది. త‌యారీ రంగ ద్ర‌వ్యోల్బ‌ణం 2.27%గా ఉంది. శుక్ర‌వారం ప్ర‌క‌టించిన అధికారిక స‌మాచారం ప్ర‌కారం టోకు ఆహార ధ‌ర‌ల పెరుగుద‌ల సూచీ మే నెల‌లో 0.15% నుంచి స్వ‌ల్పంగా పైకి ఎగ‌సి 1.25% గా న‌మోద‌యింది. ధాన్యాల విష‌యంలో 1.93% ధ‌ర‌లు పెరిగాయి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే గుడ్లు, మాంసం, చేప‌ల విష‌యంలో జూన్ నెల పెరుగుద‌ల 1.92% గా ఉంది. మొత్తంగా చూస్తే బంగాళ‌దుంప‌ల విష‌యంలో ధ‌ర‌లు 47.32% త‌గ్గితే, ధాన్యాలు 25.47%, ఉల్లిగ‌డ్డ‌లు 9.47% త‌గ్గుద‌ల‌ను క‌న‌బ‌రిచాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+