జీఎస్టీ వచ్చిన తర్వాత అన్ని చోట్లా ఆహారానికి పన్ను రేటు ఒకే విధంగా ఉండట్లేదు. జీఎస్టీ పన్ను రేటు రెస్టారెంట్లలో ఆహారంపై ఎలా విధిస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి
మీరు తరుచుగా రెస్టారెంట్లో తింటూ ఉంటారా? అయితే ఇది మీ కోసమే... ఇంతకు ముందు సేవా పన్ను 15% ఉండేది. జీఎస్టీ వచ్చిన తర్వాత అన్ని చోట్లా ఆహారానికి పన్ను రేటు ఒకే విధంగా ఉండట్లేదు. జీఎస్టీ పన్ను రేటు రెస్టారెంట్లలో ఆహారంపై ఎలా విధిస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి.

కనీసం 12 శాతం మొదలుకొని
సోషల్ మీడియాలో ఎంతో మంది జీఎస్టీకి సంబంధించి స్పష్టత కావాల్సిందిగా అడగ్గా ప్రభుత్వం ఒక యాప్‌తో ముందుకొచ్చింది. దాని పేరు జీఎస్టీ రేట్ ఫైండర్. ఏదైనా ఒక వస్తువు, సేవ పైన ఎంత శాతం జీఎస్టీ అమలవుతోందనే దీని ద్వారా తెలుస్తోంది. జులై 1 నుంచి ప్రారంభమైన జీఎస్టీ కేంద్ర, రాష్ట్ర పరోక్ష పన్నులైన వ్యాట్, సేవా పన్ను, సెస్సుల బదులు విధిస్తారు. రెస్టారెంట్లో కనీసం 12 శాతం నుంచి మొదలుకొని 18% వరకూ జీఎస్టీ ఉంటుంది.

ప్రజలకు స్పష్టత
ప్రభుత్వం ఒక్కసారి ఏకమొత్తంగా విధించే 12శాతం, 18 శాతం పన్ను రేట్లలోనే సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ కలగలిసి ఉంటాయి. ఉదాహరణకు జీఎస్టీ 12% ఉంటే అందులో సీజీఎస్టీ(కేంద్రానిది) -6%, స్టేట్ జీఎస్టీ(రాష్ట్రానిది)-6%గా ఉంటుంది. అదే జీఎస్టీ మొత్తంగా 18 శాతం ఉన్నట్లయితే స్టేట్ జీఎస్టీ 6%; సెంట్రల్ జీఎస్టీ 6% విభజిస్తారు.

పన్ను శాఖ వివరణ
ఏ రెస్టారెంట్ కూడా 28% పన్ను తీసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం చెప్పింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం మూలంగా వాస్తవ జీఎస్టీ తక్కువగా ఉంటుందని పన్ను శాఖ తెలిపింది. ఇంతకుముందు లేని ఇన్‌పుట్ క్రెడిట్ సౌకర్యం జీఎస్టీ మూలంగా వచ్చిందని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్‌కు చెందిన ప్రత్యక్ష పన్నుల నిపుణుడు సందీప్ సెఘాల్ చెప్పారు.

టర్నోవర్ ఆధారంగా
టర్నోవర్ రూ.75 లక్షల వరకూ ఉన్న రెస్టారెంట్ల విషయంలో జీఎస్టీ పన్ను రేటు 5% ఉంటుంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలండ్, త్రిపుర, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల విషయంలో ఇది రూ.50 లక్షలు అని గుర్తించాలి.

నాన్ ఏసీ రెస్టారెంట్లు, మద్యం సరఫరా చేయకపోతే
నాన్ ఏసీ రెస్టారెంట్ల విషయంలో ఇంతకు ముందు కూడా సేవా పన్ను తక్కువే. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై సైతం నాన్ ఏసీ రెస్టారెంట్ అయి ఉండి, మద్యం అందుబాటులో ఉంచని వాటి విషయంలో 12% జీఎస్టీ నిర్ణయించారు.

ఏసీ రెస్టారెంట్, మద్యం ఉంటే
పాక్షికంగా గానీ, మొత్తంగా గానీ ఏసీ ఉండి, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్ అయితే జీఎస్టీ 18 శాతంగా అమలవుతుందని గుర్తుంచుకోవాలి.

ముందే ప్యాక్ చేసిన ఆహారం
రెస్టారెంట్లలో అమ్మే ముందే వండిన, ప్రీ-ప్యాకెడ్ నమ్‌కీన్ (చిన్నపాటి) స్నాక్స్ విషయంలో 12% జీఎస్టీ విధిస్తారు. ఆర్డర్లపై కుక్ చేసి పార్సిల్ చేసే ఆమౄరం విషయంలో సైతం రెస్టారెంట్లో ఏ విధమైన పన్ను ఉంటుందో అదే అమలవుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications