వ్యాపారస్తులు కాకుండా సామాన్య ప్రజలు తమ ఆభరణాలను, వాహనాలను(కార్లు) మరొకరికి, లేదా వ్యాపారికి అమ్మితే దానికి సంబంధించి ఎటువంటి జీఎస్టీ ఉండదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. బంగారు ఆభరణాల
వ్యాపారస్తులు కాకుండా సామాన్య ప్రజలు తమ ఆభరణాలను, వాహనాలను(కార్లు) మరొకరికి, లేదా వ్యాపారికి అమ్మితే దానికి సంబంధించి ఎటువంటి జీఎస్టీ ఉండదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. బంగారు ఆభరణాల వ్యాపారి నుంచి పాత బంగారాన్ని కొంటే మాత్రం దానికి సంబంధించి 3 శాతం జీఎస్టీ అమలవుతుందన్న జీఎస్టీ చట్టంలోని నిబంధనను పేర్కొంటూ ఈ విధమైన వివరణ ఇచ్చారు. జీఎస్టీ చట్టంలోని బంగారు అమ్మకాలకు సంబంధించి ఉన్న సెక్షన్ 9(4)లో ఉన్న దాన్ని మరో దానితో కలుపుకుని చదవాల్సింది ఉందని రెవన్యూ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. దాని ప్రకారం వ్యక్తులుగా జరిపే బంగారం కొనుగోలు, అమ్మకాలు సరఫరా కిందకు రావని అందుకే వాటికి జీఎస్టీ వర్తించదని తెలిపారు. ఇక్కడ రివరన్స్ చార్జీ మెకానిజం వర్తించదని రెవెన్యూ శాఖ చెప్పింది.

అంతే కాకుండా పాత కార్లు, ద్విచక్రవాహనాలను దాని సొంత దారులు మరొకరికి అమ్మితే వాటికి సైతం జీఎస్టీ ఉండదని రెవెన్యూ అధికారులు చెప్పారు. నమోదు కాని సరఫరాదారు నుంచి నమోదిత వ్యక్తికి(బంగారు వ్యాపారస్తునికి) జరిగే వస్తు సరఫరాపై పన్ను అమలవుతుంది. ఈ సందర్భంలో నమోదిత వ్యక్తి(బంగారు వ్యాపారి) పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇది రివర్స్ చార్జీ మెకానిజం ప్రకారం జరగాలి. అంటే మొత్తంగా వ్యక్తి వ్యాపారికి అమ్మితే పన్ను ఉండదు, అదే సమయంలో నమోదు కాని వ్యాపారి అయినా సరే నమోదిత వ్యాపారికి బంగారు అమ్మినట్లయితే జీఎస్టీ ప్రకారం పన్ను చెల్లించక తప్పదని గుర్తుంచుకోవాలి. ఇది బంగారం విషయంలోనైనా, వాహనం విషయంలోనైనా ఒకటే.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications