టీసీఎస్ నిరాశజనక ఫలితాలు వెల్లడించడం, టోకు ద్రవ్యోల్బణం కాసత్ తగ్గడం, రుతుపవనాలు సరిగా విస్తరించకపోవడం వంటి కారణాల చేత దేశీయ మార్కెట్లు వారంతంలో నష్టపోయాయి.
టీసీఎస్ నిరాశజనక ఫలితాలు వెల్లడించడం, టోకు ద్రవ్యోల్బణం కాసత్ తగ్గడం, రుతుపవనాలు సరిగా విస్తరించకపోవడం వంటి కారణాల చేత దేశీయ మార్కెట్లు వారంతంలో నష్టపోయాయి. వరుస లాభాల తర్వాత శుక్రవారం సూచీలు నష్టాలకు గురయ్యాయి. సెన్సెక్స్ 16.63 పాయింట్లు నష్టపోయి 32,020.75 వద్ద ముగియగా, నిఫ్టీ 9900కు దిగువన ఈ రోజు ట్రేడింగ్‌లో 5 పాయింట్లు నష్టపోయి 9886 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్ కేర్(0.89%), చమురు,సహజ వాయు(0.67%), పీఎస్‌యూ(0.5%), పవర్(0.32%) లాభపడగా; మరో వైపు ఐటీ(0.95%), టెక్నాలజీ(0.6%), స్థిరాస్తి(0.59%), క్యాపిటల్ గూడ్స్(0.53%) నష్టపోయాయి.
సెన్సెక్స్‌లో లాభపడిన వాటిని చూస్తే ఎన్టీపీసీ(2.02%), కొటక్ బ్యాంక్(1.61%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1.04%), రిలయన్స్(0.84%) ముందున్నాయి. నష్టపోయిన వాటిలో టీసీఎస్(1.85%), టాటా మోటార్స్(1.42%), కోల్ ఇండియా(1.14%), టాటా స్టీల్(0.62%) మొదలైనవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications