ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు క్వాలిఫైడ్ ఇన్స్‌ట్యూ షనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపి) ద్వారా రూ.800-1,000 కోట్ల నిధులు సమీకరించే యేచనలో ఉంది. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేరు చె
ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు క్వాలిఫైడ్ ఇన్స్‌ట్యూ షనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపి) ద్వారా రూ.800-1,000 కోట్ల నిధులు సమీకరించే యేచనలో ఉంది. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేరు చెప్పుకోవడా నికి ఇష్టపడని ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒక్కరు పేర్కొన్నారు. దీంతో ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 60 శాతం దిగువకు పడిపోనుంది. ఆంధ్రా బ్యాంకుల్లో 2017,జూన్ 30 నాటికి ప్రభుత్వానికి 61.26 శాతం వాటా ఉంది.

త్వరలోనే క్యూఐపికి బ్యాంకు బోర్డు ఆమోదం తెలుపనుందని బ్యాంకు అధికారి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి తమ బ్యాంకుకు రూ.1,100 కోట్ల మూలధనం సమకూరిందన్నారు. ఆంధ్రా బ్యాంకుకు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉన్న భాగస్వామ్యా వాటాను తగ్గించుకునే యోచన లేదన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ కంపెనీ విలువ పెరగనుందన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి ఆంధ్రా బ్యాంకుకు చెప్పుకోదగ్గ డివిడెండ్ ఏమీ రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది కాలం వేచి చూసే ధోరణిలో ఉన్నామని అన్నారు. ఈ సంస్థలో ఆంధ్రా బ్యాంకుకు 30 శాతం వాటా ఉంది. కాగా బ్యాంకు ఆఫ్ బరోడాకు 44 శాతం, లీగల్ అండ్ జనరల్‌కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొండి బాకీల దెబ్బతో ఆంధ్రా బ్యాంకు నికర లాభాలు 32 శాతం తగ్గి రూ.35.13 కోట్లకు పరిమితమయ్యాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications