31,800 దాటిన సెన్సెక్స్
వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 57 పాయింట్లు లాభపడి ఆల్ టైం గరిష్టం 31,804.82 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 9800 మార్కును దాటేసింది. నిఫ్టీ 50 దాదాపు 30 పాయింట్లు
వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 57 పాయింట్లు లాభపడి ఆల్ టైం గరిష్టం 31,804.82 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 9800 మార్కును దాటేసింది. నిఫ్టీ 50 దాదాపు 30 పాయింట్లు పుంజుకుని 9816 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే చమురు,సహజ వాయు(1.54%), పీఎస్‌యూ(1.22%), ఇన్‌ఫ్రా(1.14%), బ్యాంకింగ్(0.51%) లాభపడగా; మరో వైపు ఐటీ(0.38%), టెక్నాలజీ(0.06%) నష్టపోయాయి.
సెన్సెక్స్ గెయినర్లలో హెచ్‌యూఎల్(2.04%), ఓఎన్‌జీసీ(1.59%), ఎస్‌బీఐ(1.34%), ఐసీఐసీఐ బ్యాంకు(1.04%), రిలయన్స్(1.02%) ఉండగా, నష్టపోయిన వాటిలో టీసీఎస్(1.33%), ఎం అండ్ ఎం(0.97%), ఐటీసీ(0.51%), హీరో మోటోకార్ప్(0.48%), డాక్టర్ రెడ్డీస్(0.36%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications