సెన్సెక్స్ సరికొత్త రికార్డు ముగింపు
మంగళవారం వరుసగా రెండోరోజూ మార్కెట్లు కొత్త రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల కారణంగా దేశీయ సూచీలు సానుకూలంగా సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 31.45 పాయింట్లు లాభపడి 31
మంగళవారం వరుసగా రెండోరోజూ మార్కెట్లు కొత్త రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల కారణంగా దేశీయ సూచీలు సానుకూలంగా సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 31.45 పాయింట్లు లాభపడి 31,747.09 వద్ద ముగియగా; మరో సూచీ నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 9786 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ సూచీ(0.91%), ఆటో(0.8%), టెక్నాలజీ(0.35%), క్యాపిటల్ గూడ్స్(0.28%) లాభపడగా మరో వైపు స్థిరాస్తి(1.56%), ఇన్‌ఫ్రా(0.72%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.7%), హెల్త్ కేర్(0.65%) నష్టపోయాయి.
సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో బజాజ్ ఆటో(2.44%), టాటా మోటార్స్(2.28%), ఎన్‌టీపీసీ(1.81%), ఎం అండ్ ఎం(1.77%), ఇన్ఫోసిస్(1.75%)ముందుండగా; నష్టపోయిన వాటిలో భారతీ ఎయిర్‌టెల్(2.59%), సిప్లా(2.06%), విప్రో(1.92%), కోల్ ఇండియా(1.85%), ఓఎన్‌జీసీ(1.54%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications