For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

355 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్‌

చాలా రోజుల త‌ర్వాత దేశీయ మార్కెట్లు బాగా రాణించాయి. ఒక ద‌శ‌లో సెన్సెక్స్ ఆల్ టైం గ‌రిష్ట స్థాయి 31,707ని దాటింది. కార్పొరేట్ కంపెనీల ఫ‌లితాల స‌ర‌ళి ఆశాజ‌న‌కంగా ఉంటాయ‌న్న అంచ‌నాలు, నివేదిక‌ల వ‌ల్ల మార్

|

చాలా రోజుల త‌ర్వాత దేశీయ మార్కెట్లు బాగా రాణించాయి. ఒక ద‌శ‌లో సెన్సెక్స్ ఆల్ టైం గ‌రిష్ట స్థాయి 31,707ని దాటింది. కార్పొరేట్ కంపెనీల ఫ‌లితాల స‌ర‌ళి ఆశాజ‌న‌కంగా ఉంటాయ‌న్న అంచ‌నాలు, నివేదిక‌ల వ‌ల్ల మార్కెట్ల‌కు క‌లిసొచ్చింది. టెక్నాల‌జీ, ఐటీ, స్థిరాస్తి, పీఎస్‌యూ రంగాలు రాణించాయి.
ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 31,716 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 9763 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
బీఎస్ఈలోని వివిధ రంగాల్లో ఆటో(0.59%), బ్యాంకింగ్ రంగం(1.06%), మూల‌ధ‌న వ‌స్తువులు(1.19%),
క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.24%) లాభ‌ప‌డ‌గా; ఎఫ్ఎమ్‌సీజీ(0.01%) న‌ష్ట‌పోయాయి.

 లాభాలలో మార్కెట్లు

సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో దివీస్ ల్యాబ్స్‌(7.94%), ఆర్‌కామ్‌(7.25%), కేర్ రేటింగ్‌(7.22%), పీఎస్‌బీ(6.31%), టాటా గ్లోబ‌ల్‌(5.66%) ఉండ‌గా, మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో రెలిగేర్‌(10.21%), శ్రీ‌రామ్‌సీఐటీ(6.41%), ఐడీఎఫ్‌సీ(5.68%), బ‌యోకాన్‌(4.69%), జీడీఎల్‌(3.73%) ఉన్నాయి.

English summary

355 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్‌ | sensex soars 355 points

All sectoral indices led by technology, IT, realty, PSU, healthcare and bank were in the green
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X