టీడీఎస్ అంటే ఏమిటి?
టీడీఎస్ అంటే పొందుతున్న ఆదాయం మూలం వద్దనే పన్ను వసూలు చేయడం. ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా ఉద్యోగుల నుంచి పరోక్షంగా ఆదాయపు పన్ను వసూలు చేయడం.
టీడీఎస్ అంటే పొందుతున్న ఆదాయం మూలం వద్దనే పన్ను వసూలు చేయడం. ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా ఉద్యోగుల నుంచి పరోక్షంగా ఆదాయపు పన్ను వసూలు చేయడం. మీరు ఏదైనా ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ ఆదాయం పన్ను మినహాయింపు పరిధి కంటే అధికంగా ఉంటే మీ యాజమాన్యం మీ వద్ద టీడీఎస్ వసూలు చేస్తుంది. మీ యాజమాన్యం టీడీఎస్ వసూలు చేసే ముందు మీరు ఆదాయపు పన్న మినహాయింపు అర్హత గల వాటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మీ ఆదాయంలో నుండి తగ్గించుకుని మీ ఆదాయానికి వర్తించే స్లాబ్స్‌కి అనుగుణంగా మూలం వద్ద పన్ను కోత విధిస్తారు.

కాబట్టి మీ పెట్టుబడుల వివరాలు యాజమాన్యానికి తెలియజేయడం తప్పనిసరి. ఒకవేళ మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా రూ.10 వేల కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం పొందితే, వడ్డీ ఆదాయంలో 10% టీడీఎస్ రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. బ్యాంకు మీ వడ్డీలోంచి మినహాయించి దాన్ని ప్రభుత్వానికి జమ చేస్తుంది. మీకు కేవలం బ్యాంక్ వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్నా లేదా మీ మొత్తం ఆదాయం పన్ను పరిధి కంటే తక్కువగా ఉన్నా ఆయం సందర్భాల్లో బ్యాంకులో 15g &15h సమర్పించి టీడీఎస్ మినహాయించబడకుండా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయంలో పింఛనును కూడా వేతనంగానే పరిగణిస్తారు. ఈ విధంగా వసూలు చేసిన టీడీఎస్‌ను ఆదాయపు పన్ను శాఖ వారికి చెల్లిస్తారు. అదే విధంగా మీకు టీడీఎస్ సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. మీ దగ్గర టీడీఎస్ వసూలు చేస్తే మీరు టీడీఎస్ సర్టిఫికెట్ తీసుకోవడం మీ బాధ్యత. అదే విధంగా టీడీఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం టీడీఎస్ వసూలు చేసిన వారి బాధ్యత. టీడీఎస్ కేవలం వేతనం, బ్యాంకు వడ్డీ ఆదాయం మీద మాత్రమే కాకుండా మీ ఆదాయాన్ని, పెట్టుబడులను బట్టి కట్ చేస్తారని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications