For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జులై 10 నుంచి గోల్డ్ బాండ్ల జారీ

ప్ర‌భుత్వ మ‌రోసారి సావ‌రిన్ గోల్డ్ బాండ్ల‌ను మ‌ళ్లీ జారీ చేయ‌నుంది. 2017-18 ఆర్థిక​ సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్‌ బాం‍డ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10-14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 2

|

ప్ర‌భుత్వ మ‌రోసారి సావ‌రిన్ గోల్డ్ బాండ్ల‌ను మ‌ళ్లీ జారీ చేయ‌నుంది. 2017-18 ఆర్థిక​ సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్‌ బాం‍డ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10-14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 28న జారీచేస్తామని ఆర్‌బీఐ నోటిఫికేష‌న్‌ పేర్కొంది. ఒక గ్రాము బంగారానికి సమానంగా ఒక బాండు జారీఅవుతుంది. ఈ త‌ర‌హా బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాము కాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాములకు సమానమైన బాండ్ల కొనుగోలుకు అనుమతిస్తారు.

 బంగారు బాండ్లు- పెట్టుబ‌డి కోసం ఒక మంచి మార్గం

8 సంవత్సరాల కాలపరిమితితో జారీచేసే ఈ బాండ్లపై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. బాండ్ల రూపంలో జారీ అయ్యే ఈ బంగారం పెట్టుబ‌డులు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి. బాండ్లు జారీఅయ్యే ముందువారం ప‌సిడి సగటుధర ఆధారంగా బాండు ధరను నిర్ణయిస్తారు. బాండ్లను తనఖాపెట్టి రుణం కూడా తీసుకోవొచ్చు. 2015 నవంబర్‌లో ఈ స్కీమును ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 8 సార్లు ప‌సిడి బాండ్ల‌ను జారీ చేసి, రూ. 5,400 కోట్లు సమీకరించారు.

English summary

జులై 10 నుంచి గోల్డ్ బాండ్ల జారీ | sovereign gold bonds through banks and post offices

The Reserve Bank of India, in consultation with Government of India, has decided to issue Sovereign Gold Bonds 2017-18 - Series II. Applications for the bond will be accepted from July 10-14, 2017. The Bonds will be issued on July 28, 2017. The Bonds will be sold through banks, Stock Holding Corporation of India Limited (SHCIL), designated Post Offices, and recognised Stock Exchanges viz., National Stock Exchange of India Limited and Bombay Stock Exchange. The features of the Bond are given below:
Story first published: Friday, July 7, 2017, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X