For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ ప్ర‌భావంతో వాహ‌న ధ‌ర‌లు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కూ త‌గ్గాయ్‌!

ఎల‌క్ట్రిక్ కార్ల‌కు 12% జీఎస్టీ ఉంటుంది. ఇంత‌కుముందు ప‌న్ను వర్తింపుల‌న్నీ క‌లిపి 28 నుంచి 45% మ‌ధ్య ఉండగా జీఎస్టీ త‌ర్వాత స‌గ‌టు ప‌న్ను రేటు 43% గా ఉంది. అయితే కంపెనీల‌న్నీ కార్ల‌పై ఏ విధంగా ధ‌ర‌ల మ

|

జులై 1 నుంచి వ‌స్తు,సేవ‌ల పన్ను కార‌ణంగా వాహ‌న కంపెనీలు కొన్నింటి పైన ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ వ‌స్తున్నాయి. జీఎస్టీ అమ‌లు త‌ర్వాత కార్ల‌పై 28% ప‌న్ను అమ‌ల‌వుతుంది. అంతే కాకుండా 1 నుంచి 15% సెస్సు ఉంటుంది కూడా. చిన్న పెట్రోలు కార్లు 1200 సీసీ ఇంజిన్ ఉండుంటే 1% సెస్సు, 1500 సీసీ క‌లిగిన డీజిల్ కార్ల‌పై 3% సెస్సు విధించేలా చ‌ట్టం ఉంది. ఎస్‌వీయూల్లో 4 మీట‌ర్ల కంటే పొడ‌వైన వాటికి, ఇంజిన్ సామ‌ర్థ్యం 1500 సీసీకి మించి ఉంటే 28% జీఎస్టీతో పాటు 15% సెస్సు అద‌నంగా విధిస్తారు. ఎల‌క్ట్రిక్ కార్ల‌కు 12% జీఎస్టీ ఉంటుంది. ఇంత‌కుముందు ప‌న్ను వర్తింపుల‌న్నీ క‌లిపి 28 నుంచి 45% మ‌ధ్య ఉండగా జీఎస్టీ త‌ర్వాత స‌గ‌టు ప‌న్ను రేటు 43% గా ఉంది. అయితే కంపెనీల‌న్నీ కార్ల‌పై ఏ విధంగా ధ‌ర‌ల మార్పును ప్ర‌క‌టించాయో చూద్దాం.

మారుతి సుజుకి

మారుతి సుజుకి

అన్ని మోడ‌ళ్ల‌పై మారుతి సుజుకి 3% వ‌ర‌కూ ప‌న్నును త‌గ్గించింది.

ఆల్టోపై రూ.2300 నుంచి రూ.5400 వ‌ర‌కూ

వాగ‌న్ఆర్ మీద రూ.5300 నుంచి రూ.8300 వ‌ర‌కూ

స్విఫ్ట్ పైన రూ.6700 నుంచి రూ.10,700 వ‌ర‌కూ

బాలెనో కార్ల‌పై రూ.6600 నుంచి రూ. 13,100 వ‌ర‌కూ

డిజైర్ కార్ల మీద రూ.8100 నుంచి రూ.15,100 వ‌ర‌కూ

ఎస్‌క్రాస్ కార్ల‌పై రూ.17,700 నుంచి రూ.21,300 వ‌ర‌కూ

 ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్‌

ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్‌

బెంగుళూరు ఎక్స్ షోరూం ధ‌ర‌ల ప్ర‌కారం ఈ కంపెనీ కార్ల ధ‌ర‌ల‌ను రూ.10,500 నుంచి రూ. 2.17 లక్ష‌ల వ‌రకూ త‌గ్గించింది.

ఫార్చూన‌ర్ కార్ల ధ‌ర‌ల‌ను రూ.2.17 ల‌క్ష‌ల వ‌ర‌కూ

ఇన్నోవా క్రిస్టా ధ‌ర‌లను రూ.98,500 వ‌ర‌కూ

ప్లాటిన‌మ్ ఇటియోస్ రూ.24,500 వ‌ర‌కూ

ఇటియోస్ లివా రూ.10,500 వ‌ర‌కూ

అదే ట‌యోటా కామ్రి, ట‌యోటా ప్ర‌య‌స్ ధ‌ర‌ల‌ను మాత్రం రూ.3.5 లక్ష‌లు(బెంగుళూరు), 5.24 ల‌క్ష‌లు(డిల్లీ)లో పెంచారు.

హోండా కార్స్ ఇండియా

హోండా కార్స్ ఇండియా

ఈ కంపెనీ అన్ని మోడ‌ల్ కార్ల ధ‌ర‌ల‌ను గరిష్టంగా రూ. 1.31 ల‌క్ష‌ల వ‌ర‌కూ త‌గ్గించింది.

హాచ్‌బ్యాక్ బ్రియో రూ.12,279 వ‌ర‌కూ

సెడాన్ అమేజ్ రూ.14,825 వ‌ర‌కూ

జాజ్‌(Jazz) రూ.10,031 వ‌ర‌కూ

మోడ‌ల్ WR-V రూ.10,064 వ‌ర‌కూ

మీడియం సైజ్ సెడాన్ సిటీ రూ.16,510 నుంచి రూ.28,005 వ‌ర‌కూ

BR-V ధ‌ర‌ల్లో రూ. 30,387 వ‌ర‌కూ త‌గ్గింపు

ప్రీమియం ఎస్‌యూవీ CR-V రూ. 1,31,663 వ‌ర‌కూ

ఫోర్డ్‌

ఫోర్డ్‌

ఫోర్డ్ కంపెనీ కార్ల ధ‌ర‌ల‌ను 4.5 శాతం వ‌ర‌కూ త‌గ్గించింది.

ఎస్‌యూవీ ఎండీవ‌ర్ రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కూ

ఫిగో దాదాపు రూ.2000 త‌గ్గింపు(ఢిల్లీలో)

ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్ రూ.8 వేలు (ఢిల్లీలో)

ఫిగో రూ.28వేల వ‌ర‌కూ త‌గ్గింపు(ముంబ‌యి)

ఎండీవ‌ర్ రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కూ (ముంబ‌యి)

టీవీఎస్ మోటార్‌, హోండా

టీవీఎస్ మోటార్‌, హోండా

టీవీఎస్ మోటార్ అన్ని మోడ‌ళ్ల‌పై ధ‌ర‌ల‌ను రూ.4150 వ‌ర‌కూ త‌గ్గించింది.

అమ్మ‌కం జ‌రిగే రాష్ట్రం ఆధారంగా హోండా మోటార్ సైకిల్ రూ.5500 వ‌ర‌కూ మోడ‌ల్‌ను బ‌ట్టి త‌గ్గించింది.

హీరో మోటోకార్ప్‌

హీరో మోటోకార్ప్‌

ఈ కంపెనీ కార్ల ధ‌ర‌ల‌ను రూ.1800 వ‌ర‌కూ త‌గ్గించింది.

బైక్ ధ‌ర‌లు రూ.40 వేల నుంచి రూ.1.1 లక్ష‌ల వ‌ర‌కూ ఉన్నాయి.

హ‌ర్యానా రాష్ట్రంలో జీఎస్టీ త‌ర్వాత ధ‌ర‌లు త‌గ్గాయి.

కొన్ని మోడ‌ళ్ల ధ‌ర‌లు పెర‌గ‌వ‌చ్చు కూడా

బీఎండ‌బ్ల్యూ

బీఎండ‌బ్ల్యూ

జ‌ర్మ‌నీ ల‌గ్జ‌రీ కారు ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.

ఎక్స్‌1 ధ‌ర‌ల‌ను రూ.1.8 ల‌క్ష‌ల వ‌ర‌కూ త‌గ్గించారు.

హైబ్రిడ్ మోడ‌ల్ ఐ8 మాత్రం 4.8 ల‌క్ష‌లు పెరిగి రూ. 2.28 కోట్ల‌కు చేరింది.

జాగ్వ‌ర్ ల్యాండ్ రోవ‌ర్‌

జాగ్వ‌ర్ ల్యాండ్ రోవ‌ర్‌

ఈ కంపెనీ కార్ల ధ‌ర‌ల‌ను ఇండియాలో 7% వ‌ర‌కూ త‌గ్గించింది.

XE ప్రారంభ ధ‌ర రూ.34.64 లక్ష‌ల నుంచి మొద‌ల‌వుతుంది.

XF ప్రారంభ ధ‌ర రూ.44.89 లక్ష‌ల నుంచి మొద‌ల‌వుతుంది.

ఎఫ్‌-పేస్ ధ‌ర రూ.67.37 ల‌క్ష‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

XJ మోడ‌ల్ ప్రారంభ ధ‌ర రూ.97.39 లక్ష‌లు(దేశ‌వ్యాప్తంగా)

మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్

ఈ కంపెనీ రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కూ కార్ల ధ‌ర‌ల‌ను తగ్గించింది.

మెర్సిడెస్ బెంజ్ ముఖ్యంగా సీఎల్ఏ సెడాన్‌, ఎస్‌యూవీలు జీఎల్ఏ, జీఎల్సీ, జీఎల్ఈ, జీఎల్ఎస్‌, ల‌గ్జ‌రీ కార్లు సీ-క్లాస్‌, ఈ-క్లాస్‌, ఎస్‌-క్లాస్‌, మేబ్యాక్ ఎస్ 500 వంటి మోడ‌ళ్ల‌ను క‌లిగి ఉంది. వీటి ధ‌ర‌లు రూ.32 ల‌క్ష‌ల నుంచి మొద‌లై రూ.1.87 కోట్ల వ‌రకూ ఉంటాయి.

ఎస్ 500 పైన రూ.7 లక్ష‌ల వ‌ర‌కూ

సీఎల్ఏ సెడాన్ మీద రూ.1.4 ల‌క్ష‌ల దాకా

Read more about: gst cars maruti honda
English summary

జీఎస్టీ ప్ర‌భావంతో వాహ‌న ధ‌ర‌లు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కూ త‌గ్గాయ్‌! | car companies reducing prices of some models after gst

turned cheaperBusinessFP StaffJul, 04 2017 08:12:22 ISTAuto companies are adjusting the prices of their products after the government rolled out goods and services tax on 1 July.Under the GST rates, cars will attract the top rate of 28 percent with a cess in the range of 1 to 15 percent on top of it.While small petrol cars with engine less than 1,200 cc will attract 1 percent cess, that with a diesel engine of less than 1,500 cc will attract 3 percent cess.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X